బిగ్ బాస్2: శ్యామలను కావాలనే ఎలిమినేట్ చేశారా..?

First Published 31, Jul 2018, 2:23 PM IST
bigg boss2: shyamala intentionally eliminated
Highlights

నిజానికి శ్యామల కంటే నూతన్ నాయుడుకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అలాంటప్పుడు ఆయన ఒక్కరినే హౌస్ లోకి పంపిస్తే సరిపోతుంది కానీ శ్యామలను కూడా తీసుకోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు కలుగుతున్నాయి

బిగ్ బాస్ సీజన్2 ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. తేజస్వి, కౌశల్, భాను శ్రీ ఇష్యూతో షో టీఆర్పీ రేటింగ్స్ సంగతి పక్కన పెడితే హౌస్ లో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇక శ్యామలను ఎలిమినేట్ చేసి ఇప్పుడు మళ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రప్పించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్యామలను కావాలనే హౌస్ నుండి ఎలిమినేట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజానికి శ్యామల ఎలిమినేషన్ ఎపిసోడ్ లో కూడా ఆమె బయటకు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. జూలైలో ఆమె కుమారుడి మొదటి పుట్టినరోజు ఉండడంతో కావాలనే ఆమెను ఎలిమినేట్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఆమె కుమారుడు పుట్టినరోజు జరిగిన రెండు రోజులకే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపిస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించడంతో ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారనే కామెంట్స్ ఎక్కువయ్యాయి.

నిజానికి శ్యామల కంటే నూతన్ నాయుడుకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అలాంటప్పుడు ఆయన ఒక్కరినే హౌస్ లోకి పంపిస్తే సరిపోతుంది కానీ శ్యామలను కూడా తీసుకోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు కలుగుతున్నాయి.   

loader