బిగ్ బాస్2: గెలిచేది వాళ్లిద్దరిలో ఒకరే.. శ్యామల కామెంట్స్

bigg boss2: shyamala about show winner
Highlights

బిగ్ బాస్2 సీజన్ పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంలో సోషల్ మీడియాలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. 

బిగ్ బాస్2 సీజన్ పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంలో సోషల్ మీడియాలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. కౌశల్ కోసం ఏకంగా ఓ ఆర్మీ కూడా తయారైంది. హౌస్ లో ఎవరికీ దక్కనంత ఆదరణ కౌశల్ దక్కించుకున్నాడు. ఇక ఆయన ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు కాబట్టి హౌస్ నుండి వెళ్తారా..? లేదా..? అనేది తెలియాల్సివుంది.

గడిచిన ఆరు వారాల్లో హౌస్ నుండి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వారిలో శ్యామల కూడా ఉన్నారు. అయితే ఈ షోకి విజేతగా ఎవరు నిలుస్తారని అనుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానంగా శ్యామల ఇద్దరి పేర్లను వెల్లడించింది. 'కౌశల్, గీతామాధురి ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్ అవుతారని అనుకుంటున్నాను. ఎంతమంది ఎన్ని చేసినా.. వాళ్లు మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు.

అందుకే వాళ్లిద్దరిలో ఒకరు విజేతగా నిలిచే ఛాన్స్ ఉంది' అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒకరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువగా శ్యామల పేరు వినిపిస్తుండడం విశేషం. 

loader