బిగ్ బాస్2: కౌశల్ పై పూజా ఫైర్.. ఆ తరువాత సామ్రాట్ జిగేలు రాణి అవతారం!

bigg boss2:  samrat's lady getup makes you laugh
Highlights

కౌశల్ తనను ఫిజికల్ గా హర్ట్ చేస్తుండడంతో పూజా ఫైర్ అయింది. దీంతో ఆ గొడవలోకి సామ్రాట్ కూడా దిగినట్లు తెలుస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక టాస్క్ పూర్తయిన తరువాత సామ్రాట్ అమ్మాయి అవతారమెత్తి హౌస్ లో ఉన్న మగాళ్లతో రొమాన్స్ చేయడం మొదలుపెట్టాడు.

 

బిగ్ బాస్ సీజన్ 2 నిన్నటి ఎపిసోడ్ లో పైరేట్స్ వర్సెస్ సర్వైవర్స్ టాస్క్ ఆసక్తిగా సాగింది. బాల పరీక్షలో ఎక్కువసేపు లేడీ కంటెస్టెంట్స్ పోరాడడం విశేషం. అయితే ఈరోజు ఎపిసోడ్ లో నిన్న పైరేట్స్ టీమ్ లో ఉన్నవారు సర్వైవర్స్ గా మారబోతున్నారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగనుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ద్వారా కౌశల్, పూజా రామచంద్రన్ ల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

కౌశల్ తనను ఫిజికల్ గా హర్ట్ చేస్తుండడంతో పూజా ఫైర్ అయింది. దీంతో ఆ గొడవలోకి సామ్రాట్ కూడా దిగినట్లు తెలుస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక టాస్క్ పూర్తయిన తరువాత సామ్రాట్ అమ్మాయి అవతారమెత్తి హౌస్ లో ఉన్న మగాళ్లతో రొమాన్స్ చేయడం మొదలుపెట్టాడు. సామ్రాట్ చేసిన యాక్టివిటీస్ తో హౌస్ లో నవ్వులు పూశాయి. ముఖ్యంగా బాబు గోగినేనితో సామ్రాట్ చేసిన అల్లరి మాములుగా లేదు.

దానికి తనీష్ కౌంటర్లు ఇవ్వడం బాగుంది. ఇక లేడీ కంటెస్టెంట్లు అందరూ సామ్రాట్ చేసిన అల్లరికి నవ్వుతూనే ఉన్నారు. ఫైనల్ గా తన పేరు జిగేలు రాణి అంటూ పరిచయం చేసుకొని గణేష్ తో కలిసి చిందేశాడు సామ్రాట్. దీంతో ఈరోజు షో ఎంటర్టైనింగ్ గా సాగబోతుందని తెలుస్తోంది. 

 

 

loader