బిగ్ బాస్2: స్నేహానికి చిచ్చు..

bigg boss2: sacrifice task highlights
Highlights

అమిత్ తన తలకు కట్టుకునే స్కార్ఫ్ ను భానుశ్రీ కోసం తొలగించుకోవాలని బిగ్ బాస్ సూచించారు. దానికి అమిత్ ఎంతమాత్రం అంగీకరించలేదు. దీంతో భానుశ్రీ కూడా ఈ వారం ఎలిమినేషన్ లో ఉండాల్సివచ్చింది. నిజానికి భాను.. అమిత్ ను భయ్యా భయ్యా అని పిలుస్తూ ఎంతో సరదాగా ఉంటుంది

ఇప్పటివరకు బిగ్ బాస్2 షో లో చూడని ఒక ఇంటరెస్టింగ్ ఎపిసోడ్ నిన్న ప్రేక్షకులకు తిలకించే అవకాశం వచ్చింది. హౌస్ లో ఉన్న వారి మానసిక పరిస్థితులను బట్టి బిగ్ బాస్ ఓ వినూత్న టాస్క్ ను అందరికీ ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. సోమవారం హౌస్ లో ఉన్నవారందరూ కూడా ఎలిమినేషన్ జోన్ లో పడిపోయారు. అందులో నుండి బయటకి రావాలంటే.. ఒక్కొక్కరూ మరో కంటెస్టంట్ మీద ఆధారపడాల్సి వచ్చింది.

దీని బట్టి వారి మధ్య ఉన్న బాండింగ్ ను బయటపెట్టే ప్రయత్నం చేశారు. తేజస్వి కోసం సామ్రాట్, రోల్ రైడా కోసం గణేష్, గీతా మాధురి కోసం తేజస్వి ఇలా హౌస్ లో ఉన్నవారు తమ స్నేహితులు ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ చెప్పినట్లుగానే చేశారు. కానీ కౌశల్, అమిత్ మాత్రం తమకు సూచించిన సాహసం చేయడానికి సిద్ధపడలేదు. ముందుగా దీప్తి కోసం కౌశల్ ను ఈ సీజన్ మొత్తం తనను తాను నామినేట్ చేసుకోవాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టడంతో కౌశల్ దానికి నిరాకరించాడు. దీంతో దీప్తి డేంజర్ జోన్ లో పడింది. అలానే అమిత్ తన తలకు కట్టుకునే స్కార్ఫ్ ను భానుశ్రీ కోసం తొలగించుకోవాలని బిగ్ బాస్ సూచించారు.

దానికి అమిత్ ఎంతమాత్రం అంగీకరించలేదు. దీంతో భానుశ్రీ కూడా ఈ వారం ఎలిమినేషన్ లో ఉండాల్సివచ్చింది. నిజానికి భాను.. అమిత్ ను భయ్యా భయ్యా అని పిలుస్తూ ఎంతో సరదాగా ఉంటుంది. అటువంటిది ఆమె కోసం అమిత్ స్కార్ఫ్ కూడా తీయకపోవడంతో వీరిద్దరి మధ్య స్నేహానికి బిగ్ బాస్ చిచ్చు పెట్టినట్లైంది. ఓవరాల్ గా నిన్నటి షో మొత్తం చూస్తే.. ఇందులో బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య స్నేహానికి చిచ్చు పెట్టడానికి ప్రయత్నించినట్లు స్పష్టం అవుతోంది. దీంతో రానున్న ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా ఉంటాయనే సంకేతాలు అందుతున్నాయి. 

loader