నిన్నటి ఎపిసోడ్ లో మహిళలు, పురుషులు రెండు టీమ్ లుగా విడిపోయి 'అంతిమ యుద్ధం' అనే టాస్క్ ను పూర్తి చేయాలి. ఇది ఫిజికల్ టాస్క్ కావడంతో మొదటినుండి పురుషులు ఆధిక్యత కనబరిచారు. టాస్క్ లో భాగంగా రెండు టీమ్ లకు బిగ్ బాస్ 50 గోల్డ్ కాయిన్ చొప్పున ఇస్తారు. ఈ రెండు టీమ్ లకు హౌస్ పై నియంత్రణ ఉంటుంది. మహిళల టీమ్ నియంత్రణలో ఉండే స్థలాలు బెడ్ రూమ్, కిచెన్ రూమ్. పురుషులు టీమ్ నియంత్రణలో ఉండే స్థలాలు లివింగ్ ఏరియా, బాత్ రూమ్ లు.

ఈ స్థలాలను వాడుకోవాలంటే గోల్డ్ కాయిన్స్ ఇచ్చి వాడుకోవాలనేది గేమ్ రూల్. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో మరికొన్ని కాయిన్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ లో చూపిన ప్రతిభ ఆధారంగా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే గేమ్ ఆడే క్రమంలో కౌశల్ మహిళలు దాచుకున్న కాయిన్స్ బ్యాగ్ ను దొంగిలించారు. దీంతో కెప్టెన్ పూజా, కౌశల్ ల మధ్య వివాదం చెలరేగింది. కౌశల్ కాయిన్స్ దొంగిలించడంపై పూజ ఫైర్ అయింది.

ఒకానొక సందర్భంలో రారా అంటూ కౌశల్ పైకి దూసుకెళ్లింది. దమ్ముంటే గేమ్ కరెక్ట్ గా ఆడాలని సవాల్ విసిరింది. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ పెద్ద దొంగ అంటూ ఆరోపణలు చేసింది. దీనికి కౌశల్ కూడా రియాక్ట్ అయ్యాడు. తనను తాను సమర్ధించుకుంటూ మాట్లాడాడు. తన దగ్గరున్న మిగిలిన కాయిన్స్ ని కూడా కౌశల్ పై విసిరికొట్టింది. కిచెన్ నుండి పురుషులకు వాటర్ కూడా ఇవ్వకూడదని హుకుం జారీ చేసింది. మిగిలిన హౌస్ మేట్స్ కూడా పూజాని సపోర్ట్ చేశారు. ఈరోజు కూడా గేమ్ కంటిన్యూ అవ్వడంతో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.