బిగ్ బాస్ 2 యాపిల్ రచ్చ: తేజస్వి, భానులపై నాని ఫైర్!

bigg boss2: nani fires on tejaswi and bhanusri
Highlights

తేజస్వి నీ నోటికి అదుపు లేదా..? అంటూ ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు నాని. ఆ టాస్క్ లో గీతా మాట్లాడుతుంటే నిన్ను తాకాడా..? లేదు కదా నువ్ మాట్లాడకు అన్నావు.. మరి నిన్ను కౌశల్ టచ్ చేశాడా..? నువ్ ఎందుకు మాట్లాడావు..? కౌశల్ ను పట్టుకొని వాడు, వీడు అన్నావు. నీ నోటికి అడ్డు, అదుపు లేదా..? అంటూ సీరియస్ అయ్యాడు.

బిగ్ బాస్2 లో రెండు రోజుల క్రితం మంచి-చెడు టాస్క్ లో పోటీదారులు పెద్ద రచ్చ చేశారు. కౌశల్ యాపిల్స్ కోసం తనను తాకరాని చోట తాకాడని భాను అతడిపై నిందలు వేస్తుంటే.. వాటిని సపోర్ట్ చేస్తూ తేజస్వి కూడా అతడిని నానా మాటలు అంది. నిజానికి కౌశల్ కావాలని అల చేయలేదని అతడి చేయి భానుకి తగలలేదని గీతామాధురి చెబుతుంటే తేజస్వి ఆమెను కూడా నిన్ను తాకాడా లేదు కదానువ్ మాట్లాడకు అంటూ నోటికొచ్చినట్లు మాటలు విసిరేసింది. ఈ విషయంపై శనివారం ఎపిసోడ్ లో నాని చాలా ఫైర్ అయ్యాడు. ఒక పిట్ట కథను హౌస్ లో ఉన్న వాళ్లకు రిలేట్ అయ్యే విధంగా చెప్పాడు. 

మనకు ఏం అనిపిస్తే అదే చేయాలి.. పక్క వాళ్లను చూసి ప్రభావితం కాకూడదు అనేది ఆ కథ మోరల్. ముందుగా గణేష్ తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం విషయంపై మాట్లాడిన నాని ప్రతి వారం సేఫ్ అవుతున్నవని ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందా..? అంటూ క్లాస్ పీకాడు. ఇక అమిత్ నామినేషన్ సమయంలో భానుతో ప్రవర్తించిన తీరు కారణంగా తన మంచితనం మొత్తం ఎగిరిపోయిందని అన్నారు. 

తేజస్వి నీ నోటికి అదుపు లేదా..? అంటూ ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు నాని. ఆ టాస్క్ లో గీతా మాట్లాడుతుంటే నిన్ను తాకాడా..? లేదు కదా నువ్ మాట్లాడకు అన్నావు.. మరి నిన్ను కౌశల్ టచ్ చేశాడా..? నువ్ ఎందుకు మాట్లాడావు..? కౌశల్ ను పట్టుకొని వాడు, వీడు అన్నావు. నీ నోటికి అడ్డు, అదుపు లేదా..? అంటూ సీరియస్ అయ్యాడు. ఇక భానుకి నామినేషన్ రాగానే పిచ్చేక్కిపోయిందని..? కౌశల్ టచ్ చేసిన 52 సెకన్ల తరువాత స్పందించడం ఏంటని ప్రశ్నించారు. మీరు గెలవాల్సింది టాస్క్ లను కాదు.. ప్రేక్షకుల మనసులను అని నాని చెప్పారు. అయితే ఈ వారంలో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఆ నిర్ణయాన్ని ఆదివారం వెల్లడిస్తానని అన్నారు. 
   

loader