తేజస్విపై అలా కామెంట్ చేస్తారా..? నెటిజన్లపై నాని ఫైర్

Bigg Boss2: Nani Fires on Netizens about negative comments
Highlights

బిగ్ బాస్ ఇంట్లోని సభ్యుడు మీకు నచ్చోచ్చు.. నచ్చకపోవచ్చు.. ఆ విషయాన్ని మీరు కామెంట్ల రూపంలో మాకు చెప్పొచ్చు.. కానీ అసభ్యపదజాలంతో కంటెస్టెంట్స్ పై కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తేజస్వి విషయంలో ఇలాంటివి మరీ ఎక్కువగా వచ్చాయి

బిగ్ బాస్ సీజన్2 టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. మొదట్లో ఈ షోపై నెగెటివి కామెంట్స్ వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం షోకి ప్రేక్షకుల అడిక్ట్ అయిపోయారు. ఆదివారం ఎపిసోడ్ లో తేజస్వి బయటకు రావడంతో హౌస్ లో ఉన్నవారంతా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సామ్రాట్ నోటవెంట మాట రాలేదు.

అయితే తేజస్వి ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్న సమయంలో బిగ్ బాస్ హోస్ట్ నాని.. నెటిజన్లపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పై వస్తోన్న కామెంట్లు చాలా అసహ్యంగా ఉంటున్నాయని ముఖ్యంగా తేజస్విపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారని నాని మండిపడ్డాడు. 

''బిగ్ బాస్ ఇంట్లోని సభ్యుడు మీకు నచ్చోచ్చు.. నచ్చకపోవచ్చు.. ఆ విషయాన్ని మీరు కామెంట్ల రూపంలో మాకు చెప్పొచ్చు.. కానీ అసభ్యపదజాలంతో కంటెస్టెంట్స్ పై కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తేజస్వి విషయంలో ఇలాంటివి మరీ ఎక్కువగా వచ్చాయి. మాటల్లో చెప్పడానికి కూడా లేని విధంగా విమర్శలు చేశారు. దేశంలో మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పడం కాదు.. అది ఆచరించి చూపించాలి. నిజంగా తేజస్వి విషయంలో కామెంట్స్ చూస్తుంటే.. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా..? అనిపిస్తోంది. కామెంట్స్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుంది'' అంటూ వెల్లడించాడు. 

loader