రాజమౌళినే అంటారా..? బాబు గోగినేనిపై కౌశల్ ఫైర్!

Bigg Boss2: Koushal Targets Babu Gogineni
Highlights

దర్శకుడు రాజమౌళి టాపిక్ తీసుకొచ్చాడు కౌశల్. బాబు గోగినేనిని నామినేట్ చేసిన కౌశల్ అతడిని ఎందుకు నామినేట్ చేస్తున్నాననే విషయాలను చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కసారి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హౌస్ లో రాజమౌళి ప్రస్తావన తీసుకురావడం అందరికీ షాకింగ్ గా మారింది. ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ లో ఇష్టం లేని మరొక వ్యక్తి నెత్తిపై గుడ్డు పగలగొట్టాలి. దానికి కారణం కూడా చెప్పాలి. అందరూ కౌశల్ ను టార్గెట్ చేసి ఆయన నెత్తిపై గుడ్డు పగలగొట్టారు. హౌస్ లో ఉన్న ఏడుగురు కౌశల్ ను టార్గెట్ చేయడంతో అతడు అసహనానికి లోనయ్యారు.

తనపై విమర్శలు చేసిన వారికి సమాధానాలు ఇచ్చే క్రమంలో దర్శకుడు రాజమౌళి టాపిక్ తీసుకొచ్చాడు కౌశల్. బాబు గోగినేనిని నామినేట్ చేసిన కౌశల్ అతడిని ఎందుకు నామినేట్ చేస్తున్నాననే విషయాలను చెప్పుకొచ్చాడు. బాబు గోగినేని.. రాజమౌళిపై చేస్తోన్న వ్యాఖ్యలు సరిగ్గా లేవని నాస్తికుడని చెప్పుకునే రాజమౌళి గుడికి ఎలా వెళ్తున్నారని ప్రశ్నించడం తనకు నచ్చలేదని.. మరో వ్యక్తి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటూ కౌశల్ అతడిని నామినేట్ చేశారు.

తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి తనకు దేవుడితో సమానమని అలాంటి  వ్యక్తి గురించి తప్పుగా మాటాడొద్దని అన్నారు. ఇక కౌశల్ కావాలనే రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చి అతడి ఫాలోవర్స్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని బాబు గోగినేని మిగిలిన హౌస్ మెంబర్స్ తో అన్నారు. 

loader