బిగ్ బాస్2: కౌశల్ పెద్ద వెధవ.. నోరుజారిన నందిని

bigg boss2: koushal fires on nandini
Highlights

ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా 'నా రుణం బాగా తీర్చుకున్నావ్' అంటూ ఆమెపై సెటైర్ వేశారు. దీంతో ఫైర్ అయిన నందిని.. అమిత్, తనీష్ ల వద్ద 'వాడొక పెద్ద వెదవ..' అంటూ నోరు జారేసి కెమెరా ముందు సారీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఈ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నటి పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చారు. రాత్రి అందరూ పడుకున్న తరువాత బిగ్ బాస్ ఆమెను హౌస్ లోకి పంపించారు. 

బిగ్ బాస్ సీజన్ 2 లో ఆదివారం తేజస్వి ఎలిమినేట్ కావడంతో సోమవారం ప్రారంభమైన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియ ఒకరి గురించి మరొకరు మాటలు అనుకునే పరిస్థితిలో జరిగింది. ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ లో మీకు నచ్చని ఇద్దరి వ్యక్తుల నెత్తిపై గుడ్డు పగల కొట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కాస్త సీరియస్ గా సాగింది. అందరూ మూకుమ్మడిగా కౌశల్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సామ్రాట్, గణేష్, తనీష్, రోల్, బాబు గోగినేని, అమిత్, నందిని అందరూ కౌశల్ నెత్తిపై గుడ్డు పగలగొట్టారు. 

అతడు హౌస్ లో చేస్తోన్న పనులు అందరితో ప్రవర్తించే తీరు నచ్చక నామినేట్ చేస్తున్నట్లు ఒక్కొక్కరు వెల్లడించారు. ఈ వారం ఎలిమినేషన్ లో కౌశల్ తో పాటు, బాబు గోగినేని, గణేష్, అమిత్, దీప్తి  సునైనా, నందినిలు ఉన్నారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో నందిని.. కౌశల్ ను నామినేట్ చేయడం భరించలేని కౌశల్ ''నిన్ను అనవసరంగా సేవ్ చేశాను.. నువ్వు స్నేహానికి అర్హురాలివి కాదు.. నువ్వు అడిగినప్పుడే నేను సలహాలు ఇచ్చాను గానీ.. నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు'' అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

loader