బిగ్ బాస్2 టైటిల్ గెలిచేది తనే: కిరీటి దామరాజు

bigg boss2: kireeti damaraju comments on tejaswi
Highlights

బిగ్ బాస్ సీజన్2 రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. షోలో ఒక్కోవారం ఒక్కో కంటెస్టంట్ ఎలిమినేట్ 

బిగ్ బాస్ సీజన్2 రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. షోలో ఒక్కోవారం ఒక్కో కంటెస్టంట్ ఎలిమినేట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజన, నూతన్ నాయుడులతో పాటు ఆదివారం కిరీటీ దామరాజు కూడా ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరీటీ హౌస్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నాడు. హౌస్ నుండి బయటకు రావడం ఎంతో బాధను కలిగించిందని అన్నారు. మరిన్ని విషయాలు చెబుతూ..

'బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి తగినట్లు వాళ్లు ఆడుతున్నారు. ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు జరగడం లేదు. అక్కడున్న వారిలో కొందరికి టైటిల్ గెలిచే అవకాశం ఉంది. అయితే నా దృష్టిలో మాత్రం అందరికంటే ఎక్కువ సత్తా ఉన్న వ్యక్తి తేజస్వి అనిపిస్తోంది. ఈ షో ద్వారా నాకు బాబు గోగినేని గారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన చెప్పిన మాటలు మర్చిపోలేను. ఇక నాని అధ్బుతంగా హోస్ట్ చేస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చాడు.

అంతేకాదు.. నాని మాటల మీదే బిగ్ బాస్ కంటెస్టంట్ ఫ్యూచర్ ఆధారపడి ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హౌస్ లో చేసిన ఓ తప్పిదం కారణంగా కిరీటీ బయటకు రావాల్సిన పరిస్థితి కలిగింది. ఇప్పుడిప్పుడే హౌస్ ఎలా ఉండాలో అర్ధమైందని అదే సమయంలో ఎలిమినేషన్ రౌండ్ బయటకు వచ్చేశానని స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యాడు కిరీటి. అతడు వెళ్లిపోతున్న సమయంలో కంటెస్టంట్లు కూడా బాధ పడ్డారు. అతడి కోసం అందరూ కలిసి ఓ పాట పాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఇక సినిమాల పరంగా ఈ నటుడు బిజీ కానున్నాడు. 

loader