బిగ్ బాస్2: కొడుకు పిలుపుతో కౌశల్ కన్నీళ్లు!

First Published 12, Sep 2018, 11:32 AM IST
bigg boss2: kaushal family in bigg boss house
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఈ ఆఖరి ఎపిసోడ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపే విధంగా మలుస్తున్నారు. ఇప్పటికి 93 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో 94 ఎపిసోడ్ కి ఎమోషనల్ టచ్ ఇస్తూ హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపించారు. 

నిన్నటి ఎపిసోడ్ లో సామ్రాట్ తల్లి, అమిత్ భార్య, కొడుకు.. అలానే దీప్తి భర్త, కొడుకు హౌస్ లోకి వెళ్లారు. వారిని చూసిన కుటుంబ సభ్యులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కౌశల్ ఇద్దరి పిల్లలు హౌస్ లోకి రాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. కన్ఫెషన్ రూమ్ లో కూర్చొన్న కౌశల్ కొడుకు 'పప్పా' అని పిలవగానే కౌశల్ కి కన్నీళ్లు ఆగలేదు.

ఫ్రీజ్ లో ఉన్న అతడిని బిగ్ బాస్ రిలీజ్ చేయగానే కన్నీళ్లు తుడుచుకుంటూ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లాడు కౌశల్. అక్కడ తన ఇద్దరి పిల్లల్ని చూసుకొని మరింత ఎమోషనల్ అయ్యాడు. ఇద్దరినీ హత్తుకొని తన ప్రేమను పంచాడు. ఈ ప్రోమో చూసిన కౌశల్ అభిమానులు సంతోషంతో మాక్కూడా కన్నీళ్లు ఆగలేదంటూ స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కొడుకుని చూసి ఎమోషనల్ అయిన అమిత్

బిగ్ బాస్2: తనీష్ కి దీప్తి భర్త వార్నింగ్!

loader