బిగ్ బాస్2: హౌస్ మేట్స్ లో ఒకరికి కమల్ ఇచ్చిన ఆఫర్

bigg boss2: kamal hassan special offer to amith
Highlights

ఇక హౌస్ లో ఒకరికి తన తరఫున ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు కమల్. అదేంటంటే.. హౌస్ మేట్స్ లో ఒకరు రెండు వారల పాటు నామినేషన్ లో లేకుండా ఒక కార్డు గిఫ్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు

లోకనాయకుడు కమల్ హాసన్ తను నటించిన 'విశ్వరూపం2' సినిమాను ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన రాకను హౌస్ మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆయనతో పాటు హీరోయిన్ పూజాకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రన్, సినిమాటోగ్రాఫర్ వచ్చారు.

బిగ్ బాస్ షో గురించి మాట్లాడిన కమల్ 'ఇది గేమ్ కానీ జీవితాలను చూపిస్తుంది అందుకే తమిళంలో నేను హోస్ట్ చేయడానికి అంగీకరించాను' అని అన్నారు. జాతీయగీతం గురించి గొప్పగా స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు కమల్.

ఇక హౌస్ లో ఒకరికి తన తరఫున ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు కమల్. అదేంటంటే.. హౌస్ మేట్స్ లో ఒకరు రెండు వారల పాటు నామినేషన్ లో లేకుండా ఒక కార్డు గిఫ్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కార్డు ఎవరికీ వస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తోన్న సమయంలో కమల్ టక్కున అమిత్ పేరు చెప్పడంతో అమిత్ ఆనందానికి హద్దులు లేవు. సో రెండు వారాల పాటు అమిత్ కు ఎలాంటి నామినేషన్స్ ఉండవన్నమాట!

loader