బిగ్ బాస్2: చిన్నప్పటి అవతారాల్లో హౌస్ మేట్స్

bigg boss2: housemates childhood memories
Highlights

సోమవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగనుందని ఈరోజు విడుదల చేసిన ప్రోమోను బట్టి తెలుస్తోంది. హౌస్ లో ఉన్నవారందరి చిన్ననాటి ఫోటోలను బిగ్ బాస్ వారికి టీవీ ద్వారా చూపించారు. ఈ ఫోటోలు చూస్తూ అందరూ తెగసంతోషపడిపోయారు

బిగ్ బాస్ సీజన్2 యాభై ఎపిసోడ్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గత వారానికి గాను ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదని నాని వెల్లడించడంతో హౌస్ మేట్స్ అందరూ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇక మరో సర్ప్రైస్ ఏంటంటే.. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఆరుగురిలో ఇప్పుడు ఇద్దరు శ్యామల, నూతన్ నాయుడు హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ఆదివారం ఎపిసోడ్ లో వెల్లడించారు. ఇక వారు హౌస్ లోకి ఎప్పుడు వెళ్లబోతున్నారనే విషయాన్ని సస్పెన్స్ గానే ఉంచేశారు. సోమవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగనుందని ఈరోజు విడుదల చేసిన ప్రోమోను బట్టి తెలుస్తోంది. హౌస్ లో ఉన్నవారందరి చిన్ననాటి ఫోటోలను బిగ్ బాస్ వారికి టీవీ ద్వారా చూపించారు. ఈ ఫోటోలు చూస్తూ అందరూ తెగ సంతోషపడిపోయారు.

మరికొందరు ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే వారు చూపించిన ఫొటోల్లో ఎవరెవరు ఎలాంటి అవతారంలో ఉన్నారో.. అలానే ఇప్పుడు రెడీ అవ్వాలని బిగ్ బాస్ చెప్పినట్లున్నారు. దీంతో అందరూ తమ చిన్నతనం జ్ఞాపకాలను తల్చుకుంటూ మురిసిపోయారు. 

 

loader