బిగ్ బాస్2: అమిత్ తో కలిసి విజిల్ వేసిన కమల్ హాసన్

bigg boss2: house mates welcomes kamal hassan in bigg boss house
Highlights

ఈ క్రమంలో హౌస్ మేట్స్ కమల్ తో కొన్ని అనుభవాలు షేర్ చేసుకున్నారు. అమిత్ అయితే కమల్ పర్మిషన్ తీసుకొని అతడు 'నటించిన అపూర్వ సోదరులు' సినిమాలో ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని విజిల్ గా వేశాడు

నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్ 2 కి అతిథిగా లోకనాయకుడు కమల్ హాసన్ రావడం హౌస్ మేట్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. కమల్ హౌస్ లోకి ఎంటర్ అయిన వెంటనే అందరూ వెళ్లి ఆయన్ను హత్తుకొని కాళ్లు పట్టుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమను తాము పరిచయం చేసుకొని ప్రత్యేకంగా కమల్ ను హౌస్ లోకి ఆహ్వానించారు.

హౌస్ లోకి వెళ్లిన కమల్ ఇల్లు చాలా బాగుందని, వారితో కొంత సమయం కేటాయించారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కమల్ తో కొన్ని అనుభవాలు షేర్ చేసుకున్నారు. అమిత్ అయితే కమల్ పర్మిషన్ తీసుకొని అతడు 'నటించిన అపూర్వ సోదరులు' సినిమాలో ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని విజిల్ గా వేశాడు. అయితే అతడితో కలిసి కమల్ కూడా విజిల్ వేయడం విశేషం. ఇక గీతామాధురి 'కమ్మని ఈ ప్రేమ లేఖలే' అంటూ పాట పాడింది. నూతన్ నాయుడు లోకనాయకుడే పెద్ద నాయకుడు అవ్వగలడని కమల్ ను పొగుడుతూ డైలాగ్స్ చెప్పాడు. 

కమల్ తో పాటు 'విశ్వరూపం2' సినిమా హీరోయిన్ పూజాకుమార్, సంగీత దర్శకుడు జిబ్రన్ అలానే సినిమాటోగ్రాఫర్ కూడా హౌస్ లోకి వచ్చారు. హౌస్ మేట్స్ అందరూ కమల్ ను పూజాతో కలిసి 'అదిరేటి డ్రెస్సు మీరేస్తే' సాంగ్ లో నడిచివచ్చినట్లు ఒకసారి నటించమని అడిగారు. దానికి కమల్ అంగీకరించి హౌస్ మేట్స్ అడిగినట్లుగా స్టైల్ గా నడుచుకుంటూ హౌస్ లో అందరినీ ఎంటర్టైన్ చేశారు.  

loader