బిగ్ బాస్2: నందినిపై కౌశల్ ఫైర్.. ఒకప్పుడు కళ్లల్లో కారాలు కొట్టినప్పుడు భరించాం కదా..

bigg boss2: fight between kaushal and nandini during captaincy task
Highlights

సామ్రాట్, అమిత్, గీతామాధురి, దీప్తి నల్లమోతు ఈ టాస్క్ లో పాల్గొన్నారు. అయితే వీరిని తన చేష్టలతో డిస్టర్బ్ అయ్యేలా చేయాలనుకున్నాడు కౌశల్. ఒకరి జుట్టు లాగడం, మరొకరిపై మ్యాట్ వేయడం వంటి పనులు చేస్తుండడంతో నందిని.. కౌశల్ ను వారించే ప్రయత్నం చేసింది

'స్టాట్యూ అవ్వండి కెప్టెన్సీ గెలవండి' అని బిగ్ బాస్ ఈ వారం కంటెస్టెంట్లకు కెప్టెన్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం కెప్టెన్ పోటీలో పాల్గొనే వారు బాడీ పెయింట్ వేసుకొని స్టాట్యూ అవతారమెత్తి ఒక టేబుల్ మీద కదలకుండా నిలబడాలి. ఎవరు ఎక్కువసేపు అలా నిలబడి ఉంటారో వాళ్లు వచ్చేవారం నుండి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాలి. సామ్రాట్, అమిత్, గీతామాధురి, దీప్తి నల్లమోతు ఈ టాస్క్ లో పాల్గొన్నారు.

అయితే వీరిని తన చేష్టలతో డిస్టర్బ్ అయ్యేలా చేయాలనుకున్నాడు కౌశల్. ఒకరి జుట్టు లాగడం, మరొకరిపై మ్యాట్ వేయడం వంటి పనులు చేస్తుండడంతో నందిని.. కౌశల్ ను వారించే ప్రయత్నం చేసింది. దీంతో కౌశల్ ఒకప్పుడు టాస్క్ లో కళ్లల్లో కారాలు కొట్టినప్పుడు భరించాం కదా.. అని చెప్పబోతే అది అప్పుడు టాస్క్ కదా అని నందిని ఏదో చెప్పబోతే ఇది కూడా టాస్కే అంటూ తనను సమర్ధించుకొని మాట్లాడాడు కౌశల్.

గతంలో కౌశల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నప్పుడు కిరీటి.. తన కళ్లల్లో నిమ్మకాయ పిండడం వంటి పనులు చేశాడు. ఆ సంఘటనను ఉద్దేశించి కౌశల్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. మరి ఈ కెప్టెన్సీ టాస్క్ తో ఈరోజు ఎపిసోడ్ ఎలా సాగుతుందో చూడాలి!

 

 

loader