బిగ్ బాస్2: భాను ఎలిమినేషన్.. కౌశల్ పై బిగ్ బాంబ్

bigg boss2: bhanu sri eliminated
Highlights

మంచి-చెడు టాస్క్ లో భాను.. కౌశల్ పై అభియోగాలు చేయడం ఆమెను ఎలిమినేట్ అయ్యేలా చేశాయని చెప్పొచ్చు. అయితే వెళ్లిపోతూ వెళ్లిపోతూ హౌస్ లో ఉన్నవారితో మాట్లాడిన భాను.. సునైనాను ఎవరి మీద ఆధారపడకుండా గేమ్ ఆడమని సలహా ఇచ్చింది. 

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ లో ఉన్న దీప్తి, గణేష్, భానుశ్రీలలో అందరూ అనుకున్నట్లుగానే భానుశ్రీ బయటకు వచ్చేసింది. మొదటి నుండి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించిన భాను నామినేట్ అయ్యేసరికి ఆమె ప్రవర్తనలో వచ్చి మార్పు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అదే విషయాన్ని శనివారం నాని కూడా వెల్లడించడంతో ఈ వారంలో భాను బయటకు వెళ్లిపోతుందేమోనని చాలా మంది గెస్ చేశారు.

సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై పోల్స్ కూడా నిర్వహించారు. మంచి-చెడు టాస్క్ లో భాను.. కౌశల్ పై అభియోగాలు చేయడం ఆమెను ఎలిమినేట్ అయ్యేలా చేశాయని చెప్పొచ్చు. అయితే వెళ్లిపోతూ వెళ్లిపోతూ హౌస్ లో ఉన్నవారితో మాట్లాడిన భాను.. సునైనాను ఎవరి మీద ఆధారపడకుండా గేమ్ ఆడమని సలహా ఇచ్చింది. ఇక రోల్ రైడా, అమిత్, గణేష్ ల పట్ల తన అభిమానాన్ని తెలియజేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పింది.

సామ్రాట్ ను తను సొంతంగా గేమ్ ఆడితే చూడాలని ఉందని కోరింది. ఇక దీప్తిని టార్గెట్ చేస్తూ.. జనాల ప్రేమ కోసం కాకరకాయ జూస్ తాగడం వంటివి కాకుండా సిన్సియర్ గా గేమ్ ఆడమని చెప్పింది. ఇక బిగ్ బాంబ్ ను కౌశల్ పై విసిరింది. దాని ప్రకారం ఈ వారం మొత్తం అమిత్ కూర్చునే ప్రతిసారి కౌశల్ అతడికి కుర్చీ వేయాలి.   

loader