బిగ్ బాస్2: కౌశల్, గీతామాధురి హౌస్ లో ఉండడానికి వీల్లేదు.. బాబు ప్లాన్

bigg boss2: Babu Gogineni Target To Geetha Madhuri And Kaushal
Highlights

డుతూ ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. అక్కడితో ఆగకుండా.. నేను ఈ వారం ఎలిమినేట్ కాకుండా హౌస్ లోనే ఉంటే గనుక కౌశల్, గీతామాధురిలను ఎలా బయటకు పంపించాలనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెడతా అంటూ వెల్లడించారు

బిగ్ బాస్ సీజన్2 ఈ వారంలో బాబు గోగినేని ఉగ్రరూపం దాల్చారు. నేను ఇంటెర్నేషనల్ ఫిగర్ అంటూ మొదలుపెట్టిన ఆయన కౌశల్ ను ఈ హౌస్ నుండి ఎలాగైనా పంపించేయాలి అంటూ ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని మిగిలిన హౌస్ మేట్స్ వద్ద చెబుతూ వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేశారు. కౌశల్ కు హౌస్ లో అందరూ యాంటీగా ఉండడంతో బాబు గోగినేని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నా అందరూ తలాడించారు.

అయితే రెండు రోజులుగా ఆయన గీతామాధురిపై ఫైర్ అవ్వడం అందరికీ షాక్ ఇస్తోంది. ఆయన అనవసరంగా టాపిక్ పెద్దది చేస్తున్నాడనే ఫీలింగ్ అందరిలో ఉంది. కానీ ఆయన మాత్రం గీతా ఎం మాట్లాడినా.. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. అక్కడితో ఆగకుండా.. నేను ఈ వారం ఎలిమినేట్ కాకుండా హౌస్ లోనే ఉంటే గనుక కౌశల్, గీతామాధురిలను ఎలా బయటకు పంపించాలనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెడతా అంటూ వెల్లడించారు. హౌస్ లో తనులేకపోయినా మీరంతా ఇదే చేయండి.. వాళ్లిద్దరూ హౌస్ కి డేంజర్ అంటూ మిగిలిన హౌస్ మేట్స్ కు చెప్పాడు.

బాబు గోగినేని చేసే వ్యాఖ్యలు హౌస్ మేట్స్ కు నచ్చకపోయినా.. ఆయనతో మనకెందుకులే అన్నట్లు ఊరుకుండిపోయారు. ఈ వారం హౌస్ లో ఎలిమినేషన్ ఉండదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవేళ బాబు గోగినేని హౌస్ లోనే ఉంటే మరి గీతా, కౌశల్ లను బయటకు పంపడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి!

loader