- Home
- Entertainment
- Ranabaali: పూనకాలు తెప్పించేలా విజయ్ దేవరకొండ `రణబాలి` టైటిల్ గ్లింప్స్, స్వాతంత్య్రానికి ముందు నాటి చీకటి కోణాలు
Ranabaali: పూనకాలు తెప్పించేలా విజయ్ దేవరకొండ `రణబాలి` టైటిల్ గ్లింప్స్, స్వాతంత్య్రానికి ముందు నాటి చీకటి కోణాలు
రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న `వీడీ14` మూవీ టైటిల్‌ని ప్రకటించారు. దీనికి `రణబాలి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బ్రిటీష్ కాలం నాటి కథతో దీన్ని రూపొందించారు.

వీడీ 14 నుంచి అదిరిపోయే అప్ డేట్
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి చాలా కాలంగా హిట్ లేదు. `గీత గోవిందం` తర్వాత సరైన సినిమా పడటం లేదు. `టాక్సివాలా`, `ఖుషి`, `కింగ్డమ్` చిత్రాలు ఫర్వాలేదనిపించినా, ఆయన స్టామినాకి, ఆయన రేంజ్‌కి సరిపోవడం లేదు. దీంతో అభిమానులు ఆకలితో ఉన్నారు. సాలిడ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన రెండు క్రేజీ సినిమాలతో రాబోతున్నారు. వాటిలో ఆద్యంతం ఆసక్తికరంగా నిలిచిన మూవీ `వీడీ14`. ఇటీవల దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ దీనికి సంబంధించిన పెట్టిన పోస్టే ఈ మూవీపై అంచనాలను పెంచింది.
రణబాలి గా విజయ్ దేవరకొండ
అభిమానులు దర్శకుడికి లేఖ రాయగా, వారికి స్పందిస్తూ, అభిమానుల ఆకలి తీర్చేలా ఉంటుందన్నారు. ఇప్పుడు నిజంగానే వారి ఆకలి తీర్చేలా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా రిపబ్లిక్ డేని పురస్కరించుకుని సోమవారం ఈ సినిమా నుంచి టైటిల్‌ని ప్రకటించారు. దీనికి `రణబాలి` అనే పేరుని ఖరారు చేశారు. టైటిల్‌ని రివీల్ చేస్తూ ఓ కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు. 1878లో జరిగిన కథని ఇందులో చూపించబోతున్నారు. ఆ సమయంలో బ్రిటీష్ వారు మన భారతీయులను ఎంతగా చిత్ర హింసలు పెట్టారు, కనీసం ఫుడ్ కూడా లేకుండా ఎలా దోచుకున్నారనేది ఇందులో చూపించారు.
స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు జరిగిన చీకటి రహస్యాలు
స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు జరిగిన చీకటి రహస్యాలను, చరిత్రలోని లేని రహస్యాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు రాహుల్. ఆ టైమ్‌లో మన ఇండియా నుంచి బ్రిటీష్ వారు ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకుపోయారట. హిట్లర్ కంటే దారుణమైన నియంతృత్వం చోటు చేసుకుందట. కేవలం 40ఏళ్ల వ్యవధిలోనే వందల మిలియన్స్ ప్రజలు ఆకలితో చనిపోయారట. ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి రణబాలి పుట్టుకొచ్చాడని, బ్రిటీష్ వారి అంతు చూశాడనే విషయాన్ని ఇందులో చూపించారు.
జయమ్మగా రష్మిక మందన్నా
ఇందులో రణబాలిగా విజయ్, జయమ్మగా రష్మిక మందన్నా కనిపించనున్నారు. చివరగా గుర్రంపై స్వారీ చేస్తూ ఓ బ్రిటీష్ అధికారిని లాక్కుంటూ విజయ్ రైలు పట్టాలపై నుంచి విజయ్ ఎంట్రీ ఇచ్చిన తీరు మాత్రం మైండ్ బ్లోయింగ్. కోపంతో, ఆవేశంతో అరుస్తూ ఆయన కనిపించడం అదిరిపోయింది. విజయ్ దేవరకొండలోని మరో యాంగిల్‌ని ఇందులో చూడొచ్చు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. పూనకాలు తెప్పిస్తుంది.
పాన్ ఇండియా మూవీగా `రణబాలి`
`టాక్సీవాలా` తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రిత్యన్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రమిది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టీ సిరీస్ ఇందులో భాగమయ్యింది. భారీ పాన్ ఇండియా మూవీగా `రణబాలి`ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ మూవీని విడుదల చేయనున్నారు.

