బిగ్ బాస్2: వెక్కి వెక్కిన ఏడ్చిన కౌశల్, సామ్రాట్, గణేశ్, రోల్.. కారణమేంటంటే..?

bigg boss2: 60th episode highlights
Highlights

''మా అమ్మ చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని కాల్చే సమయంలో ఆమె కాలికి ఉన్న మెట్టెను తీసుకొని నాతో ఉంచుకున్నాను. అది గుర్తొచ్చిన ప్రతిసారీ నాకు కన్నీళ్లు ఆగవు. మా అమ్మ చనిపోయిన తరువాత నాకు పుట్టిన కూతురికి ఆమె పేరు పెట్టుకున్నాను. జీవితంలో ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఎవరూ తల్లిని అశ్రద్ధ చేయొద్దు'' అంటూ ఎమోషనల్ అయ్యాడు కౌశల్

బిగ్ బాస్ సీజన్ 2 లో బుధవారం నాడు కూడా 'అంతిమయుద్ధం' టాస్క్ కొనసాగింది. నిన్నటి ఎపిసోడ్ ఓ పురుషులు ఆధిక్యంలో ఉన్నారు. బుధవారం ఎపిసోడ్ లో కూడా వారే  ఆదిపత్యం కొనసాగించారు. స్త్రీలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ గెలవలేకపోయారు. అయితే బిగ్ బాస్ కొందరు మేల్ కంటెస్టెంట్స్ కి ఓ కొత్తరకమైన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా నలుగురు పురుషులు భావోద్వేగానికి లోనై కనీళ్లు కార్చాలి. ఆ సమయంలో అందరూ సైలెంట్ గా ఉండాలి.

టాస్క్ లో భాగంగా కౌశల్, సామ్రాట్, గణేశ్, రోల్ రైడా నిజంగానే తమ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను గుర్తుతెచ్చుకొని ఏడ్చేశారు. ''మా అమ్మ  చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని కాల్చే సమయంలో ఆమె కాలికి ఉన్న మెట్టెను తీసుకొని నాతో ఉంచుకున్నాను. అది గుర్తొచ్చిన ప్రతిసారీ నాకు కన్నీళ్లు ఆగవు. మా అమ్మ చనిపోయిన తరువాత నాకు పుట్టిన కూతురికి ఆమె పేరు పెట్టుకున్నాను. జీవితంలో ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఎవరూ తల్లిని అశ్రద్ధ చేయొద్దు'' అంటూ ఎమోషనల్ అయ్యాడు కౌశల్
 

గణేశ్: 'బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ ఎవరూ జాబ్ ఇవ్వలేదు. 8వేల కోసం 8నెలలు రోడ్ల మీద తిరిగాను. కనీసం 10 వేలు కూడా సంపాదించలేని పరిస్థితి నాది. కానీ నటించాలి.. రేడియో జాకీ అవ్వాలనే గోల్ ని మాత్రం వదలలేదు. మీరు కూడా మీ గోల్ ని వదలద్దు' అని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. 
 

సామ్రాట్: 'నా పేరెంట్స్ ని చాలా అశ్రద్ధ చేశాను. మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సంధర్భంలో వాళ్ల విలువ ఏంటో తెలిసింది. డాక్టర్ ఏం చెప్తారో అని ఎదురుచూసిన క్షణాలు గుర్తు చేసుకుంటే నరకంలా అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేయొద్దు' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక రోల్ రైడా ర్యాపర్ గా ఎదిగే సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. 

loader