నాపై విష ప్రచారం జరుగుతుంది. నేనెక్కడికీ పోలేదు..ఇదిగో ఇక్కడే ఉన్నారు. నాపై పగబట్టారు.. నన్ను బ్యాడ్ చేస్తున్నారంటూ.. ఓవీడియో రిలీజ్ చేశాడు పల్లవి ప్రశాంత్.. ఇంతకీ ఏమంటున్నాడంటే..? 

ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 7 రచ్చ మామూలుగా జరగడంలేదు. ప్రస్తుతం ఈ విషయంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ఈసీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్‌ అయ్యాడే కాని.. అతనికి ఈ సంతోషం నిలబడటంలేదు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పరారీ లో ఉన్నాడంటూ జరుగుతున్న ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విఛాఫ్ చేశాడంటూ వార్తు వైరల్ అవుతూ వచ్చాయి. ప్రశాంత్ కోసం పోలీసులు బృందాలుగా వెతుకుతున్నట్టు కూడా న్యూస్ వైరల్ అయ్యింది. దాంతో ఈ విషయంలో ప్రశాంత్ స్పందించారు. 

నాగార్జునను అరెస్ట్ చేయాలని డిమాండ్, మన్మధుడి మెడకు చుట్టుకున్న బిగ్ బాస్ వివాదం

ఈ విషయంలో తాజాగా ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు. తను పారిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను ఇంట్లోనే ఉన్నట్టు వీడియోలో చూపుతూ.. ప్రకటించాడు పల్లవి ప్రశాంత్‌. తాను ఇంట్లోనే ఉన్నన్నట్లు వీడియో విడుదల చేశారు. నేను ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లిపోలేదు. కావాలంటే మా ఊరివాళ్లను అడగండి అంటూ..తనతో పాటు కొంత మందిని పక్కనే పెట్టుకుని వీడియో సందేశం చేశాడు. నాపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు భారీగా జనాలు వచ్చారు. పోలీసులహెచ్చరికలు నాకు సరిగ్గా వినబడలేదు అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు ప్రశాంత్. 

View post on Instagram

తనపై నెగెటీవ్ ప్రచారం జరుగుతుందని.. ననుబ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రశాంత్‌ ఎక్కడికి వెళ్లలేదని నిన్న అయ్యప్ప పడిపూజకు వెళ్లాడంటు కుటుంబ సభ్యులు.. స్నేహితులు అన్నారు. ఇక అటు పల్లవి ప్రశాంత్ తన తరుపున లాయర్ ను రంగంలోకి దింపాడు. పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని..కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. FIR కాపీ వారు ఇవ్వాల్సింది పోయి.. కుటుంబ సభ్యులు రావాలి అని చెబుతున్నట్లు వివరించారు.

పల్లవి ప్రశాంత్ ఆవేదన, నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారంటూ వీడియో

ఇక FIR కాపీ లేకపోవడంతో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తే తెలుస్తుందన్నారు అడ్వకేట్ రాజేష్ కుమార్. ప్రస్తుతం ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు సీపీఐ నారాయణ కూడా గట్టిగా స్పందించారు. ఈ బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని అన్నారు. ఈ షో హోస్ట్ నాగార్జున పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.