Asianet News TeluguAsianet News Telugu

పల్లవి ప్రశాంత్ ఆవేదన, నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారంటూ వీడియో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా గెలిచిన రౌతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పలు వివాదాలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా అతను ఓ వీడియో లో మాట్లాడాడు. తనపై కుట్ర జరుగుతుందంటూ వాపోయాడు .
 

Pallavi Prashanth From Bigg Boss Telugu 7 Winner New Video Viral JMS
Author
First Published Dec 20, 2023, 10:47 AM IST

బిగ్‌బాస్ తెలుగు  సీజన్ 7 విన్నర్ గా  పల్లవి ప్రశాంత్ ని ప్రకటించిన దగ్గర నుంచి  రచ్చ జరుగుతుంది. ప్రశాంత్ అవ్వడాని విన్నర్ అయ్యడే కాని.. ఈ విషయంలో భిన్న స్వారాలు వనిపిస్తున్నాయి. అది పక్కన ఉంచితే.. అతనికి కూడా విన్నర్  అయిన ఆనందం లేకుండా పోయింది.  హౌస్ లో, బిగ్‌బాస్ కి వెళ్ళకముందు అమాయకంగా, వినయంగా ఉండి సింపతితో కప్పు కొట్టేశాక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక తన యాటిట్యూడ్ చూపిస్తూ వైరల్ అయ్యాడు.

మొదటి నుంచి ప్రశాంత్ వైకరి కాని.. అతనిమాటలు కాని.. డిఫరెంట్ గానే ఉన్నాయి. గేమ్ ఆడియాన.. రైతు బిడ్డను అన్న పేరు.. సింపతీ.. బేస్ మీదనే చాలా వరకూ డిపెండ్ అయ్యాడు ప్రశాంత్. ఇక టైటిల్ సాధించి..ఫైనల్ అయినోయిన తరువాత బయటకి వచ్చిన తరువాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.పల్లవి ప్రశాంత్ అసలు రూపం అప్పుడు కనిపించింది జనాలకు ఆ రోజు రాత్రి బయటికి వచ్చాక ప్రశాంత్, అతని ఫ్యాన్స్ రోడ్డు మీద ఊరేగింపు పేరుతో చేసి హంగామా.. విద్వాంశానికి దారి తీసింది. రన్నర్ గా నిలిచిన అమర్ కారుపై దాడి చేయడంతో పాటు.. ఇరు వర్గాలు కొట్లాటతో.. ఆర్టీసీ బస్సులు కూడా డామే చేసి.. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. 

దాంతో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని ఫ్యాన్స్, అనుచరులపై కూడా కూడా పోలీసులు కేసులు నమోదు అయ్యాయి. బస్సులు ద్వంసంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా మండిపడ్డారు. ఇక ప్రశాంత్ కూడా మునుపటి వినయం పక్కన పెట్టి.. కాస్త రూడ్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు.  మీడియాతో కూడా  అతను అలానే బిహేవ్ చేశాడు.  ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వను అంటూ అసభ్య పదజాలం కూడా వాడినట్టు మలువురు యూట్యూబ్ యాంకర్స్ తమ సోషల్ మీడియాలో వెల్లడించినట్టు తెలుస్తోంది. దాంతో ప్రశాంత్ సాధించిన మంచి పేర కాస్త నెగెటీవ్ గా మారింది. ఈ విషయాలన్నీ వైరల్ అవ్వడంతో తాజాగా  ప్రశాంత్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. 

Pallavi Prashanth: పరారీలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్... పోలీసుల గాలింపు!

పోలీస్ కేసు అవ్వడం.. ప్రశాంత్ కోసం తన ఊరుకు పోలీసులు వెల్లడంతో అతను పరారీలో ఉన్నట్టు తెలిసింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టాడు ప్రశాంత్. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక మొదటిసారి డైరెక్ట్ గా ప్రశాంత్ మాట్లాడుతూ ఓ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రశాంత్ ఎప్పటిలాగే తన పొలంలో కూర్చొని ఎమోషనల్ గా మాట్లాడాడు. తనను బ్యాడ్ చేసే ప్రయత్నం జరగుతుందని. గెలిచిన ఆనందం కూడా లేకుండా చేస్తున్నారని. తన కోసం ఎంత మంది జనం వచ్చారో చూశారు కదా.. అభిమానంతో వారంతా వచ్చారు.  ఒక రైతుబిడ్డ గెలిచాడని అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఊర్లో ఎంతో  ఘన స్వాగతం పలికారు. నేను బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక నా కోసం ఇంతమంది వచ్చారా అని ఆనందపడ్డాను. కాని ఆ ఆనందం ఆవిరి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  

 

మీడియా వాళ్ళు నన్ను నెగిటివ్ చేద్దామని చూస్తున్నారు. నా కోసం అక్కడికి దాదాపు 70 యూట్యూబ్ ఛానల్స్ దాకా వచ్చాయి. వాళ్ళు అందరి 5, 10 నిముషాలు అని ఇంటర్వ్యూలు అడిగారు. నేను అప్పటికే అలిసిపోయి ఉన్నా, ఆకలి వేస్తుంది, ఏం తినలేదు, తర్వాత ఇస్తాను ఇంటర్వ్యూలు అని చెప్పాను.  కాని నేను కోపంగా మాట్లాడాను అని నాపై నెగిటివ్ ప్రచారం చేేస్తున్నారు. ఒక రైతుబిడ్డ ఇలా గెలవడం మీకు ఇష్టం లేదా..? నేను గెలవడం తప్పా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ విధంగా మరోసారి సింపతీ గెలిచే ప్రయత్నం చేశాడు ప్రశాంత్. 

రణ్ వీర్ సింగ్ కు అరుదైన గౌరవం, ఆహీరోల సరసన బాలీవుడ్ స్టార్..

 ప్రశాంత్ ఇదంతా మాట్లాడాడు కాని..తనుగెలిచిన సమంయంలో జరిగిన రచ్చ,చేసిన డామేజ్..గొడవలు.. తాను మాట్లాడిన మాటల గురించి మాత్రం వివరణ ఇవ్వలేదు. దాంతో ప్రశాంత్ వీడియోకు రివర్స కౌంటర్లు పడుతున్నాయి. తననువిమర్షిస్తూ.. కామెంట్లు పెడ్తున్నారు జనాలు. ఇక ఇంత రచ్చ జరగడంతో.. అసలు బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు సొషల్ యాక్టివిస్ట్ లు. నాగార్జునను అరెస్ట్ చేయాలంటూ కోర్టుకెక్కారు కొంత మంది. సీపీఐ నారాయణ మరోసారి బిగ్ బాస్ పై ఫైర్ అయ్యారు. వెంటనే ఈ షోను బ్యాన్ చేయాలి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios