యష్‌ని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా? `బిగ్‌ బాస్‌ 8` ఫేమ్‌ సోనియా ఆకుల చెప్పిన నిజాలు

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోతో గుర్తింపు తెచ్చుకున్న సోనియా ఆకుల ఇటీవలే యష్‌ ని వివాహం చేసుకుంది. ఆయనకిది రెండో పెళ్లి. అయినా మ్యారేజ్‌ చేసుకోవడానికి దారితీసిన విషయాలు చెప్పింది సోనియా. 
 

bigg boss telugu 8 fame sonia akula revealed why she married yash arj

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోతో పాపులర్‌ అయిన సోనియా ఆకుల ఇటీవలే మ్యారేజ్‌ చేసుకుంది. ఆమె వ్యాపారవేత్త యష్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. దీనికి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. యాంకర్‌, డైరెక్టర్‌ ఓంకార్‌ కూడా వచ్చారు. ప్రస్తుతం మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సోనియా తాజాగా ఓ వీడియోని వదిలింది. 

యష్‌కి ఆల్‌ రెడీ పెళ్లి..

తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పెళ్లి వీడియో పెట్టింది సోనియా. మెహందీ వేడుకకి సంబంధించిన విషయం, తాను ఎందుకు యష్‌ని మ్యారేజ్‌ చేసుకుందో అనే విషయాలను వెల్లడించింది సోనియా. యష్‌కి ఆల్‌రెడీ పెళ్లి అయ్యింది. మొదటి భార్యకి విడాకులు ఇచ్చారు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అతను యష్‌తోనే ఉంటాడు. ఆ అబ్బాయిని సోనియా స్వీకరించింది. తాను చూసుకునేందుకు ఒప్పుకుంది. అలా యష్‌ ఫ్యామిలీకి బాగా నచ్చింది సోనియా. 

యష్‌ని సోనియా పెళ్లి చేసుకోవడానికి కారణం..

ఈ క్రమంలో యష్‌ని మ్యారేజ్‌ చేసుకోవడానికి కారణమేంటి? అని తెలిపింది. సోనియా ప్రారంభించిన ఎన్జీవోకి వెడ్‌ డిజైనింగ్‌గాన యష్‌ చేశాడు. దీంతోపాటు స్పాన్సర్‌గానూ వ్యవహరించారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు బాగా క్లోజ్‌ అయ్యారు. సోనియాకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యష్‌ పరిచయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయట. అంతేకాదు తనకంటూ ఓ డ్రీమ్‌ ఉండేది. డ్రీమ్‌ హౌజ్‌ కట్టుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఎమోషనల్‌గా బ్యాలెన్స్ రావాలని, ఆర్థికంగా బ్యాలెన్స్ రావాలి అని ఉండేదట. వాటిలో యష్‌ పాత్ర ఎంతో ఉందని చెప్పింది సోనియా. 

యష్‌లో సోనియాకి నచ్చిన విషయం..

యష్‌ తనని తాను కొత్తగా పరిచయం చేశాడని, తనలో ఎంతో మార్పుకు కారణమయ్యాడని తెలిపింది. ఏదో చూశామా పడిపోయామా అనేట్టుకాకుండా చాలా రోజులు ట్రావెల్‌ కావడం, ఈ జర్నీలో చాలా తెలుసుకోవడం, నేర్చుకోవడం జరిగిందని, మోరల్‌గానూ ఆయన సపోర్ట్ గా ఉండేవాడని, తనని చాలా స్ట్రాంగ్‌గా మార్చాడని చెప్పింది సోనియా. అందుకే తాను మ్యారేజ్‌ చేసుకునేందుకు ఒప్పుకుందట. తమ మధ్య అంతటి అండర్‌ స్టాండింగ్‌ ఉంది కాబట్టే పెళ్లికి సిద్ధమైనట్టు చెప్పింది సోనియా ఆకుల. 

సొంత కూతురిలా చూసుకున్న యష్‌ తండ్రి..

పెద్దవాళ్లని ఒప్పించే విషయంలో తన పేరెంట్స్ కి ఆప్షన్‌ లేదని, తాను ఏది చెబితే అదే అని వెల్లడించింది. వారిని నేనంటే అంత నమ్మకం అని, అలాగే యష్‌ వాళ్ల పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయమని, అంకుల్‌ తనని కూతురులా భావిస్తాడని, ఎవరు ఏమన్నా, తాను చెప్పింది రైటే అని అంటుంటారు. అంతగా తనని నమ్ముతాడని చెప్పింది సోనియా. తనకు తన పేరెంట్స్ కంటే ఎక్కువ బలం ఇచ్చింది ఆ అంకులే అని చెప్పింది. 

బిగ్‌ బాస్‌ 8 షోలో సోనియా రచ్చ..

సోనియా ఆకుల `బిగ్‌ బాస్‌ తెలుగు 8` షోతో ద్వారా పాపులర్‌ అయ్యింది. అంతకంటే ముందు ఆమె హీరోయిన్‌గా చేసింది. `కరోనా వైరస్‌` చిత్రంలో నిటంచింది. రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన `ఆశః`ఎన్‌ కౌంటర్‌` సినిమాలో టైటిల్‌రోల్ చేసి విమర్శకుల ప్రశంసలందుకుంది. వర్మ హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యింది. ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 8 లోకి వచ్చి ఆమె ప్రారంభంలో రచ్చ చేసింది. నిఖిల్‌, పృథ్వీరాజ్‌లతో పులిహోర కలిపి మరింత పాపులర్‌ అయ్యింది. కావాల్సిన కంటెంట్‌ ఇచ్చింది. కానీ గేమ్స్ ఆడకపోవడంతో త్వరగానే హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. 

read more: భాను ప్రియా తల్లికి ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా? క్లాస్‌ మేట్‌ లాగా అంటూ ట్విస్ట్ !

also read: `దేవర 2` స్టార్ట్ అయ్యేది అప్పుడే, ఎన్టీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌?.. గూస్‌ బంమ్స్ తెప్పించే స్టోరీ?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios