ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రసాభాసగా మారింది. సిరి విషయంలో షన్ను, సన్నీ బాహాబాహీ గొడవకు దిగారు. ఇద్దరూ కొట్టుకుంటారేమో అన్నట్లు మారింది వ్యవహారం. 

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ (Bigg boss) ఓ గేమ్ నిర్వహించారు. టవర్ లో ఉంది పవర్, అనే ఈ టాస్క్ లో కొందరు టవర్ నిర్మిస్తుంటే, మరొకరు బాల్స్ తో దాన్ని కూల్చే ప్రయత్నం చేయాలి. ఈ టాస్క్ లో తనని ఆడకుండా సిరి అడ్డుపడడంతో సన్నీ ఫైర్ అయ్యాడు. మళ్ళి నేను గేమ్ ఆడితే నిన్ను అప్పడంలా తొక్కేస్తా, నన్ను ఎందుకు అడ్డుకున్నావ్ అని, సిరిపై కోప్పడ్డాడు. 

ఇక సిరి (Siri) కి సన్నీకి గొడవ జరుగుతుండగా, మధ్యలో షణ్ముఖ్ కలుగజేసుకున్నాడు. సిరికి సప్పోర్ట్ గా అతడు రావడం జరిగింది. దీనితో షన్ను, సన్నీ మధ్య పెద్ద వివాదం తెలెత్తింది. ఏరా పోరా అనే స్థాయి దాటి, కొట్టుకుందామా... కొడతావా అనే రేంజ్ కి వెళ్ళింది . కాసేఫు ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. కంటెస్టెంట్స్ కలగజేసుకొని ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

Also read Bigg Boss Telugu 5: కుక్కల్లాగా పనిచేశాం, అనీ మాస్టర్ సీరియస్..బిగ్ బాస్ హౌస్ లో ధర్నా

సన్నీ అగ్రిసివ్ నేచర్ తో అనేకమార్లు విమర్శలు పాలయ్యాడు. మరి ఈ వారం కూడా నాగార్జున ఈ గొడవ గురించి, ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కలదు. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీ సీక్రెట్ రూమ్ లో ఉంటూ గేమ్ గమనిస్తున్నాడు. విశ్వ ఎలిమినేషన్ తో హౌస్ లో ప్రస్తుతం 9 మంది మాత్రమే ఉన్నారు. కోలుకున్నాక జెస్సీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

Also read Bigg boss telugu5:హౌస్ లో మానస్-ప్రియాంక కోసం పూల పరుపు సిద్ధం... ట్రాన్స్ జెండర్ తో శృతిమించిన హీరో రొమాన్స్!

ఇక ఈవారం ఆరుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. సన్నీ, రవి, కాజల్, సిరి, మానస్... నుండి ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు. ఫైనల్ కి చేరే అర్హత ఉన్నట్లు భావిస్తున్న ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేటైనా కూడా సంచలనమే. మరో రెండు రోజుల్లో ఈ వారం హౌస్ నుండి ఎలిమినేటయ్యే ఆ కంటెస్టెంట్ ఎవరో తేలిపోనుంది. మరోవైపు ఈ సారి బిగ్ బాస్ షో (Bigg boss telugu 5) అనుకున్నంత ఆదరణ దక్కించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. 

View post on Instagram