Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: జెస్సీ ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. మానస్‌కి ముద్దులిచ్చిన ప్రియాంక..కాజలే సాక్ష్యం..

65వ రోజు ఇంటి సభ్యులతో కేవలం పులిహోర కలిపించాడు బిగ్‌బాస్‌. వారి నిజ స్వరూపాలను బయటపెట్టించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో జెస్సీ ని ఇంటి నుంచి పంపించడంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. 

bigg boss telugu 5 65th day episode highlights twist in jessi elimination
Author
Hyderabad, First Published Nov 9, 2021, 11:46 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5).. 65వ రోజు షో ఆద్యంతం ఇంటి సభ్యుల డిష్కషన్‌, ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం, అలకలు, కామెడీలతో సాగింది.  మొదట సన్నీ, మానస్‌లు సోమవారం జరిగిన నామినేషన్ల గురుంచి డిస్కస్‌ చేసుకున్నారు. ఉంటే కలిసి ఉందాం. పీకితే కలిసే పోదాం. ఈ వారం ఒకళ్లం, వచ్చే వారం ఇంకొకళ్లం అవుతామన్నాడు సన్నీ. మానస్‌ కూడా ఈ నామినేషన్‌పై పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ గేమ్‌లో కాజల్‌, ప్రియాంకల గురించి నిజం తెలిసిందని తెలిపాడు. అదే సమయంలో చాలా విషయాలను రవి క్రియేట్‌ చేస్తున్నాడని, గతంలోనూ ఆయనే అనేక విషయాలను క్రియేట్‌ చేసి మనకు చెప్పాడని మానస్‌ షాకింగ్‌ కామెంట్లు చేశాడు. మరోవైపు శ్రీరామ్‌, రవి, అనీ మాస్టర్‌, అలాగే షణ్ముఖ్‌, సిరిలు, ప్రియాంక, కాజల్‌ ఇలా ఎవరికి వాళ్లు పులిహోర కలపడం స్టార్ట్ చేశారు. 

ఇంతలో బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు బిగ్‌ షాక్‌ ఇచ్చాడు. జెస్సీని పిలిపించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇప్పుడు ఫర్వాలేదన్నాడు జెస్సీ. కానీ వైద్యుల సమక్షంలో ఇన్వెస్టిగేషన్‌ జరగాలని, టెస్టులు చేయాల్సి ఉందని, తక్షణమే హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్‌. అందుకు ఓకే చెప్పిన జెస్సీ హౌజ్‌ నుంచి వెళ్లిపోవాలనే మాటతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. హౌజ్‌లోకి వచ్చి సభ్యులతో అదే విషయం చెప్పాడు. దీంతో అందరు షాక్‌కి గురయ్యారు. ముఖ్యంగా షణ్ముఖ్‌, సిరి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనీ మాస్టర్‌, ప్రియాంక చాలా ఎమోషనల్‌ అయ్యారు. అయితే మళ్లీ వచ్చే అవకాశం ఉందని, వస్తావంటూ ఆయనకు భరోసా ఇచ్చి పంపించాడు. కాసేపు సభ్యుల మధ్య జెస్సీ విషయం టాపిక్‌గా మారింది. 

 జెస్సీని ఇంటికి పంపిస్తారని, తిరిగి రాడని అంతా అనుకుంటున్న సమయంలో బిగ్‌బాస్‌ బిగ్‌ ట్విస్ట్ ఇచ్చాడు. జెస్సీని వైద్యపరీక్షల నిమిత్తం బయటకు పంపించిన తర్వాత సీక్రెట్‌ రూమ్‌లో ఉంచాడు. కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని, తదుపరి బిగ్‌బాస్‌ ఆదేశం వరకు అందులోనే ఉండాలన్నారు. అనంతరం శ్రీరామ్‌, కాజల్‌ మధ్య నామినేషన్‌ డిస్కషన్‌ వచ్చింది. తనని ఎందుకు సేవ్‌ చేశావని శ్రీరామ్‌ని కాజల్‌ అడగ్గా ఓ మంచి ఉద్దేశంతోనే సేవ్‌ చేశానని చెబుతాడు. అయినా శ్రీరామ్‌ని అనుమానిస్తుంది కాజల్‌. అయితే అలా అనుమానించడానికి అంతకు ముందు మానస్‌,సన్నీ ఆమెని రెచ్చగొట్టడమే కారణం. నిన్ను వెదవల్ని చేశారని, ఫైనల్లీ మమ్మల్ని నువ్వు వెర్రిపుష్పం చేశారని అంటాడు సన్నీ. దాని ఎఫెక్ట్ తోనే శ్రీరామ్‌ని ప్రశ్నిస్తుంది కాజల్‌. అయితే ఇదే విషయాన్ని శ్రీరామ్‌ కూడా రవి, ఆనీ మాస్టర్లతో ముందే చెప్పడం గమనార్హం. 

మరోవైపు ప్రియాంకని మానస్‌ దూరం పెడుతూ వస్తున్నాడు. సన్నీ, కాజల్‌ ప్రశ్నించడంతో ఎట్టకేలకు కూల్‌ అయ్యాడు. ప్రియాంకతో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆమె తీసుకొచ్చిన ఫుడ్‌ తీసుకోవాలంటే ముద్దు ఇవ్వాలనే కండీషన్‌ కూడా పెట్టాడు. ఇలా రెండు ముద్దులిచ్చింది ప్రియాంక. ఇది కాస్త ఓవర్గా అనిపించింది. మరోవైపు తనని మూడో వ్యక్తి ముందు కామెంట్‌ చేయడం, నవ్వడంపై సిరిపై ఫైర్‌ అయ్యాడు షణ్ముఖ్‌. దీంతో కాసేపు వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మూడో వ్యక్తి ముందు తనపై జోకులేస్తే నచ్చదని, దాన్ని తీసుకోనని చెబుతాడు షణ్ముఖ్‌. దీంతో దూరంగా వెళ్లిన సిరి.. షణ్ముఖ్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎందుకు నవ్వుతాడు, ఎందుకు దగ్గరికి తీసుకుంటాడో, ఎందుకు దూరం పెడతాడో అర్థం కాదు అంటూ ఆవేదన చెందింది. అన్నీ తనపైనే తీర్చుకుంటాడని వాపోయింది. 

పింకీ బల్లిని తయారు చేసి సన్నీపై వేసింది ఆయన్ని భయపెట్టించారు. ఇది నవ్వులు పూయించింది. తర్వాత స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద అందరు కలిసి సరదాగా నవ్వుకున్నారు. షణ్ముఖ్‌, జెస్సీలను ఇమిటేట్‌ చేసి కామెడీ చేశాడు రవి. అక్కడ షణ్ముఖ్‌తో సహా అందరు నవ్వుకున్నారు. కానీ ఆ తర్వాత మోజ్‌ రూమ్‌లోకి వెళ్లి తాను ఆ విషయానికి ఫీల్‌ అయ్యానని రవి ముందు బుంగమూతి పెట్టాడు షణ్ముఖ్‌. అందుకే ఎవరికీ ఛాన్స్ ఇవ్వనని, ఇస్తే ఇలా కామెడీ చేస్తారని తెలిపాడు. తనకు ఫన్‌లా లేదన్నాడు. దానికి రవి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. మళ్లీ రిపీట్‌ చేయనన్నాడు. దీంతో పింకీపై పడ్డాడు షణ్ముఖ్‌. పింకీ తని గెలికిందని, ఇప్పుడు ఆమెకి ఇస్తాను చూడు అంటూ రెచ్చిపోయాడు షణ్ముఖ్‌. పైకి వెళ్లేందుకు తననెందుకు తొక్కడం అంటూ అసహనం వ్యక్తం చేశాడు. 

ఇక చివరగా హౌజ్‌లోకి స్వీట్‌ వచ్చింది. దాన్ని తినే అర్హత ఒక్కరికి మాత్రమే ఉందని అందులో రాసి ఉంది. మరి ఆ ఒక్కరు ఎవరని ఇంటి సభ్యులు గింజుకుంటున్నారు. ఇలా మొత్తంగా మంగళవారం ఎపిసోడ్‌లో సభ్యుల పులిహోరలు కలపడంతోనే కాలక్షేపం చేశాడు బిగ్‌బాస్‌. ఎలాంటి గేమ్ లు, టాస్క్ లు ఇవ్వలేదు. మరోవైపు సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న జెస్సీ ఇవన్నీ చూస్తుండటం విశేషం. 

also read: Bigg Boss Telugu 5: షణ్ముఖ్‌, సిరిలపై మానస్‌ షాకింగ్‌ కామెంట్‌.. ఈ వారం నామినేట్‌ అయ్యింది వీళ్లే

Follow Us:
Download App:
  • android
  • ios