Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: షణ్ముఖ్‌, సిరిలపై మానస్‌ షాకింగ్‌ కామెంట్‌.. ఈ వారం నామినేట్‌ అయ్యింది వీళ్లే

 సోమవారం(66) ఎపిసోడ్‌లోనూ అదే హ్యాంగోవర్‌లో ఉన్నారు. అయితే ఇందులో షణ్ముఖ్‌, సిరిలపై మానస్‌ ఓ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. సన్నీతో మాట్లాడుకునే టైమ్‌లో వాళ్లిద్దరు కంటెంట్‌ ఇవ్వడానికే వచ్చారని వ్యాఖ్యానించాడు.

manas shocking comments on shanmukh and siri Bigg boss 5 10th week nomination list
Author
Hyderabad, First Published Nov 8, 2021, 11:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌ బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5) తొమ్మిది వారాలు పూర్తయ్యాయి. నేటితో(సోమవారం) పదో వారంలోకి అడుగుపెట్టాం. ఇప్పటి వరకు తొమ్మిది మంది ఎలిమినేట్‌ అయ్యారు. పది మంది హౌజ్‌లో ఉన్నారు. ఈ వారం అనూహ్యంగా విశ్వ(Vishwa) ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు లోబో, ప్రియా, స్వేత, హమీద, లహరి, నటరాజ్‌మాస్టర్‌, ఉమాదేవి, సరయు ఎలిమినేట్‌ అయ్యారు. అయితే తొమ్మిదో వారంలో విశ్వని ఎలిమినేట్‌ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇంటి సభ్యులు కూడా దీనిపై రకరకాల కామెంట్లు చేశారు. 

ఇంట్లో గేమ్‌ ఆడటం, టాస్క్ ల్లో పాల్గొనడం మాత్రమే కాదు, ఇంకా ఏదో జరుగుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్‌ అవుతారో తెలియదంటూ కామెంట్లు చేశారు. Bigg Boss Telugu 5 సోమవారం(66) ఎపిసోడ్‌లోనూ అదే హ్యాంగోవర్‌లో ఉన్నారు. అయితే ఇందులో షణ్ముఖ్‌, సిరిలపై మానస్‌ ఓ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. సన్నీతో మాట్లాడుకునే టైమ్‌లో వాళ్లిద్దరు కంటెంట్‌ ఇవ్వడానికే వచ్చారని వ్యాఖ్యానించాడు. రవిని టచ్‌ చేయాలంటే విశ్వని దాటుకుని వెళ్లాలి. విశ్వ..రవికి ఓ బాడీగార్డ్ లాగా పనిచేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రవి, షణ్ముఖ్‌ల మధ్య ఇదే డిష్కషన్‌ జరిగింది. ప్రియాంక వెళ్లిపోతే మానస్‌ పరిస్థితేంటి అని షణ్ముఖ్‌ అడగ్గా.. రవి స్పందిస్తూ సన్నీని చూసుకుంటాడు, వాళ్లిద్దరు అలానే ఉంటారు కదా అంటూ కామెంట్ చేయడం ఇంట్రెస్ట్ గా మారింది. 

అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి పంథా మార్చారు బిగ్‌బాస్‌. కెప్టెన్‌ అనీ మాస్టర్‌ నలుగురిని నామినేట్‌ చేసి జైలుకి పంపించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అనీ మాస్టర్‌..  మానస్‌, సన్నీ, కాజల్‌, షణ్ముఖ్‌లను జైలుకి పంపించి నామినేట్‌ చేస్తుంది. నామినేషన్ల నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఇచ్చాడు బిగ్‌బాస్‌. బజర్‌ మోగిన వెంటనే లివింగ్‌ రూమ్‌లో ఉన్న తాళాలను ఎవరైతే దక్కించుకుంటారో వాళ్లు.. తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ని జైలు నుంచి బయటకు తీసుకురావొచ్చని మిగిలిన ఇంటి సభ్యులకు సూచించాడు. 

ఇందులో భాగంగా ప్రియాంక తాళం దక్కించుకొని మానస్‌ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన మానస్‌.. జెస్సీ, రవిలను నామినేట్‌ చేశాడు. సిరి తాళం దక్కించుకొని షణ్ముఖ్‌ను కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. జెస్సీ వల్ల షణ్ముఖ్‌ బయటపడ్డాడు. తనకు ఒకరిని నామినేట్‌ చేసే చాన్స్‌ రావడంతో.. పింకీని ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ చేస్తున్నానని చెప్పాడు. 

దీంతో బాగా హర్ట్‌ అయిన పిం‍కీ.. `ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్‌ లేదని నన్ను నామినేట్‌ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. నా పాయింట్‌లో నువ్వు కరెక్ట్‌ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్‌ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు` అంటూ అసహనం వ్యక్తం చేయగా.. `నా పాయింట్‌లో ఇదే కరెక్ట్‌.. నేను ఇలానే నామినేట్‌ చేస్తా. అది నా ఇష్టం` అంటూ షణ్ముఖ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రవి తాళం దక్కించుకుని ప్రియాంకని సేవ్‌ చేశాడు. షణ్ముఖ్‌ని పంపించారు. శ్రీరామ్‌ తాళం దక్కించుకుని కాజల్‌ని సేవ్‌ చేశాడు. సిరిని లోపలికి పంపించారు. 

also read: Pakka Commercial Teaser: విలనిజం ఎప్పుడో చేసి చూసి వదిలేశానంటోన్న గోపీచంద్‌

చివరగా కాజల్‌ తాళం దక్కించుకుని షణ్ముఖ్‌ని సేవ్‌ చేశారు. రవినిజైల్లోకి పంపించారు. దీంతో ప్రస్తుతం జైల్లో మానస్‌, సన్నీ, సిరి, రవి ఉన్నారు. ఫైనల్‌గా కెప్టెన్‌ అనీ మాస్టర్ కి మరొకరిని నామినేట్‌ చేసే అవకాశం ఇవ్వడంతో ఇప్పటి వరకు తనకు హెల్ప్ చేయని వారిలో కాజల్‌ ఉన్నారని ఆమెని నామినేట్ చేసింది. దీంతో ఈ వారం మానస్‌, సన్నీ, సిరి, రవి, కాజల్‌ నామినేట్‌ అయ్యారు. 

also read: Samantha: సమంతకి అరుదైన గౌరవం.. `ఇఫీ`లో స్పీకర్‌గా.. తొలి దక్షిణాది నటి

Follow Us:
Download App:
  • android
  • ios