అలీ రెజా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అలీ తన ఎలిమినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను బిగ్ బాస్ లో 50 రోజులు గడిపాను. అంతకు ముందెప్పుడూ నేను నామినేట్ కాలేదు. తొలి సారి నామినేషన్స్ లోకి వెళ్ళగానే నేను ఎలిమినేట్ అయ్యేందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయని అనిపించింది. 

కానీ నాపై నాకు నమ్మకం ఉండింది. అనుకోని విధంగా  ఆడియన్స్ ఓటింగ్ లో తేడా కొట్టింది. నేను బలమైన కంటెస్టెంట్ అని అంతా భావించారు. తాను ఎలిమినేట్ కాననే గట్టి నమ్మకం ప్రేక్షకుల్లో ఉండేది. తాను ఎలాగైనా సేవ్ అవుతునానే నమ్మకంతో ప్రేక్షకులు వేరేవాళ్లకు ఓటింగ్ చేసారు. అందువల్లే తాను ఎలిమినేట్ అయ్యానని అలీ రెజా తెలిపాడు. 

నేను హిందీతో పాటు అన్ని బాగ్ బాస్ షోలని ఫాలో అవుతా. గత సీజన్స్ లో కొందరు అర్హత లేనివాళ్లు కూడా విజేతలుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. వారు ప్రేక్షకుల ప్రేమని పొందలేదు. విన్నర్స్ కి కూడా దక్కనంత ప్రేమ నాకు దక్కింది. ఆ విషయంలో తాను సంతోషంగా ఉన్నాయని అలీ రెజా తెలిపాడు. 

ఇదిలా ఉండగా గత సీజన్ లో మాదిరిగా ఈ సీజన్ లో కూడా రీఎంట్రీ ఉంటే అలీ రెజాకు ఆ అవకాశం కల్పించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి. 'బ్రింగ్ బ్యాక్ అలీ రెజా' పేరుతో క్యాంపెయిన్ నడుస్తోంది. 

ఫైనల్ గా షూ పాలిష్ చేసి బిగ్ బాస్ కి సారీ చెప్పిన పునర్నవి!