గత రెండు రోజులుగా 'ఇంట్లో దెయ్యం నాకేంటి భయం' అనే టాస్క్‌తో ఇంటి సభ్యులతో ఆడుకున్న బిగ్ బాస్ కి చుక్కలు చూపించింది పునర్నవి. బిగ్ బాస్ షూ పాలిష్ చేయాలని విధించిన శిక్షని తను ఫాలో అవ్వనని బిగ్ బాస్ తోనే గొడవకి దిగింది. ఇక గురువారం నాటి ఎపిసోడ్ లో మాత్రం పునర్నవి రాజీ పడింది.

నిన్న, మొన్నటి ఎపిసోడ్‌లలో క్యారెక్టర్ అంటూ అన్ని మాటలు మాట్లాడిన పునర్నవి ఫైనల్ గా బిగ్ బాస్ కి సారీ చెప్పి షూ పాలిష్ చేసింది. అనంతరం పునర్నవితో పాటు మహేష్, శ్రీముఖిలకు సైతం లగ్జరీ బడ్జెట్ వాడుకోవచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఇక ఈ వారం కెప్టెన్సీ కోసం 'బరువు లెత్తగలవా జెండా పాతగలవా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. 

ఇందులో ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌ కాని వారికి ఛాన్స్ ఇచ్చారు. దీని ప్రకారం శ్రీముఖి, పునర్నవిలు కెప్టెన్ అయ్యేందుకు ఆసక్తి చూపించకపోవడంతో.. మహేష్, వితికా, రవిలు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడ్డారు. టాస్క్ ప్రకారం.. కెప్టెన్ కావాలనుకున్న వాళ్లు.. వాళ్లకు నచ్చిన వాళ్ల వీపుపై ఎక్కి తమకు ఇచ్చిన జెండాలను ఒక ప్లేస్‌లో పెట్టాల్సి ఉంటుంది. 

ఇలా జోడీగా ఆడిన ఆటలో ఎవరు ఎక్కువ జెండాలు పెడితే వాళ్లే బిగ్ బాస్ కొత్త కెప్టెన్ అని చెప్పారు బిగ్ బాస్. ఈ క్రమంలో వితికా తన భర్త వరుణ్ వీపుపై.. శ్రీముఖి-రవి వీపుపై.. శివజ్యోతి- మహేష్ వీపుపై ఎక్కి గేమ్ ఆడారు. ఈ ప్రాసెస్ లో వితికా ఎక్కువ జెండాలు పెట్టడంతో ఈ వారం ఆమె కెప్టెన్ గా ఎంపికైంది.