Asianet News TeluguAsianet News Telugu

ఇంటి సభ్యులకు జర్నీ వీడియోలు చూపించి వాళ్లపై ఒపీనియన్ చెప్పిన బిగ్ బాస్

  • చివరి వారం కొనసాగుతున్న బిగ్ బాస్ షో
  • గ్రాండ్ ఫినాలే విజేతలుగా నిలిచేందుకు పోటీపడుతున్న ఐదుగురు కంటెస్టంట్స్
  • ఫైనల్ లో పోటీపడుతున్న శివబాలాజీ,ఆదర్శ్, నవదీప్,అర్చన,హరితేజలు
  • పాత సీసాలోనే కొత్త సారా, మంగళవారం పాత వీడియోలు చూపిన బిగ్ బాస్
bigg boss reveals opinion about house mates

గత ఆరు వారాలుగా హౌజ్ మేట్స్ మధ్య విబేధాలతో రక్తికట్టిన బిగ్ బాస్ షో చివరి వారం ప్రేక్షకులను అలరించడంలో కాస్త వెనకబడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటివరకు దీక్ష  హౌజ్ లో వున్నప్పుడు.. అర్చనతో జరిగే ఫైట్.. ఏమీ ఎరగనట్టే పక్కనుంచి హరితేజ అర్చనకు దీక్షపై ఎక్కించడం(కీ ఇచ్చి ఆజ్యం పోయడం), అవకాశం దొరికితే తను కూడా దీక్షను ఏదో అనటం, దీక్ష దాన్ని వ్యతిరేకించడం ఇలా హౌజ్ మేట్స్ మధ్య విబేధాలతో ప్రేక్షకులకు వినోదం దొరికింది. అయితే దీక్ష వెళ్లిపోయాక.. షో మరీ చపప్పగా సాగటం కనిపిస్తోంది. మరోపక్క హౌజ్ మేట్స్ కూడా.. అలా అలా తమ పని తాము చేసుకుంటూ హౌజ్ లో ఎప్పుడు గ్రాండ్ ఫినాలే అవుతుందా..ఎప్పుడు వెళ్లిపోదామా అన్నట్లు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

 

ఇక 65వ రోజు.. ఉ.8గంటలకు.. పాటతో ప్రారంభమైన దినచర్య అనంతరం బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు సంబంధించిన వీడియోలను చూపిస్తూ సాగింది. హౌజ్ మేట్స్ అనుభవాలతో కూడిన ఆ వీడియోలను వారికి చూపించడంతో కాస్త ఎమోషన్ టచ్ మాత్రం ఎక్కువై ఆసక్తిగా అనిపించింది. ఉదయం ఏదో తెలుగురాని పౌరురాలిగా హరితేజ ఆంగ్లంలో మాట్లాడుతూ.. హడావిడి చేస్తుంటే బిగ్ బాస్ వారించి తెలుగులో మాట్లాడాలని సూచించారు. అనంతరం.. అర్చన కమ్ హియర్ అనగానే హరితేజ దగ్గరికి వెళ్లింది. అప్పుడు నేను ఫూలిష్ గా ఫీలవుతున్నానంటూ జోక్ చేసి దీక్షను గుర్తు చేసింది.

ఇక రాత్రి 7.30కు.. యాక్టివిటీ ఏరియాకు హౌజ్ మేట్స్ ను పిలిచిన బిగ్ బాస్ ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించి వారికి సంబంధించిన హౌజ్ ఎక్స్పీరియెన్సెస్ తో వీడియోలు చూపించారు బిగ్ బాస్. ఈ సందర్భంలో కంటెస్టంట్స్ ఒక్కొకరిపై ఒక్కో రకంగా కమెంట్స్, కాంప్లిమెంట్స్ ఇచ్చారు బిగ్ బాస్.

 

ముందుగా నవదీప్...

నవదీప్ ను పిలిపించిన బిగ్ బాస్... తన కమెంట్స్ లో... నవదీప్ వైల్డ్ కార్డ్ ద్వారా తుఫాన్ లా వచ్చారు. వాతావరణాన్ని పూర్తిగా మార్చారు. ఎంతో అవసరమైన మార్పు. ఇంటి సభ్యులకు సంతోషం, ఉత్తేంతో పాటు, సవాళ్లను కూడా తీసుకొచ్చారు. వైల్జ్ కార్డ్ కంటెస్టంట్ గా మాత్రమే కాక బలమైన కంటెస్టంట్ లా వచ్చి మిగతా సభ్యుల వెన్నులో వణుకు పుట్టించారు. మీ రాకను ఇంటి సభ్యులు సగం నుంచి ప్రారంభించారని చెప్పినా... బిగ్ బాస్ .. నామినేషన్ కు గురి అయ్యారు. మీ ప్రదర్శనతో టాస్క్ లలో ఉదాహరణగా నిలిచారు. ఓపికతో ఆలోచించి ప్రతిసారి అర్థం చేసుకున్నారు. మీ తుంటరి ఆలోచనలతో ప్రతి టాస్క్ ను వినోద భరితంగా మార్చారు. మీ స్థిరమైన ఆలోచన, ప్రదర్శనతో బలమైన కంటెస్టంట్ గా నిలిచారు. దీంతో మిమ్మల్ని మిగతా సభ్యులు వ్యతిరేకించకుండా ఆడారు. మీరు ఇక్కడిదాకా వచ్చిన తీరు ప్రసంశనీయం. బిగ్ బాస్ అభినందిస్తున్నారు అన్నారు.

ఇక నవదీప్ బిగ్ బాస్ హౌజ్ జర్నీ వీడియో.... ఫన్నీగా సాగిందు. తర్వాత యాక్సిడెంట్ గురించి ఇచ్చిన కన్ఫెషన్ గుర్తు చేశారు. మధ్యలో నవదీప్ చెప్పిన సమస్యలొస్తే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నానన్న కమెంట్ వినిపించారు. అది చూసిన నవదీప్ పెద్దగా ఎమోషనల్ అవకున్నా.. మంచి అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. థాంక్యూ అన్నారు. నవదీప్ బయటికి రాగానే దీనిపై చర్చ జరిగింది. ఫుల్లు దెయ్యాల శబ్దాలినబడ్డాయని హరితేజ అనగా.. నవదీప్ నిజమా...అని రిప్లై ఇచ్చాడు. అయితే ఎవరికేం చూపిస్తున్నారో తెలియదు కాబట్టి నేనేం చెప్పను అంటూనే దట్ దట్ కేమ్ అంటూ ఇక నుంచి దడ్ దడ్ అన్నాడు నవదీప్.

 

అమ్మను మరోసారి చూశానన్న అర్చన...

ఇక బిగ్ బాస్ అర్చననను కూడా పిలిపించి మాట్లాడారు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా... నామినేషన్ చాలా సార్లు వచ్చినా.. హౌజ్ లో నిలబడి చాలా బాగా ఆడాలని అర్చనకు కితాబిచ్చారు బిగ్ బాస్. అయితే.. ఏ విషయాన్నైనా డ్రాగ్ చేయడం వల్ల డిస్కషన్ పెరుగుతుందే తప్ప తగ్గదని, అలాంటివి మానుకుంటే ఇంకా బాగుంటుందని అర్చనకు బిగ్ బాస్ సూచించారు. ఫైనల్ కోసం బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఇక అర్చన వీడియోలో... ఎంట్రీ నుంచి మొదలు పెట్టి.. మధ్యలో స్నానం చేస్తున్న ఫుటేజీని అందరికీ ఎవైలబుల్ వుంటుందన్న అర్చన కమెంట్ తో నవదీప్.. అర్చన ఇలా అంటోంది అంటూ మళ్లీ బాత్ రూమ్ పుటేజీ అంటూ మాట్లాడాడు. ఇక అర్చన మేకప్ వేసుకుని రెడీ అయి హౌజ్ లో వున్న బోయ్స్ అందర్నీ కవ్వించిన సీన్ చూపించిన బిగ్ బాస్ ఆ తర్వాత... అర్చన మరో యాంగిల్ చూపించారు. అసలు నాలుగు వారాలు నాకు నామినేషన్ లేదు. కానీ సడెన్ గా నాలుగో వారం మెజారిటీ నామినేషన్స్ నా పేరే రావడం బాధాకరమని అర్చన ఫీలైంది. మరోవైపు దీక్ష ఏం మాట్లాడినా... నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు. అంటూ అరవడం కనిపించింది.

ఇక స్కూల్ టాస్క్ లో..మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు నేర్చుకోవాలి అంటూ అర్చన చెప్పడం హరితేజ అమ్మ గురించి చెప్పడం ఎమోషన్ పండించింది. ఇక టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు తోపులాటలో దీక్షను సడెన్ గా అర్చన షడాప్ అంది. దీక్ష షాకయి ఎందుకలా అంటున్నావని ప్రశ్నించింది.

ఇక శివబాలాజీ కూడా ఫుడ్ గురించి అర్చనను ఏదో అనటం.. హర్ట్ అయిన అర్చన నేను తినను అనటం.. తర్వాత టక్కున అనేసి.. సారీ అంటే ఏమనాలి. నేను ఇప్పుడు తినను, దాచుకుని రాత్రికి తినేస్తా అని శివబాలాజీతో చెప్పింది. ఆతర్వాత నా మనస్తత్వం అంత చెడడ్డది కాదని కానీ బయటికి మాత్రం చెడ్డదానిలా ప్రొజెక్ట్ చేస్తున్నారని అర్చన చెప్పడం వీడియోలో కనిపించింది. ఇదంతా గత ఎపిసోడ్ లలో టెలికాస్ట్ చేసిన కార్యక్రమం నుంచి తీసుకుని చేసిన ఏవీగా చెప్పాలి. ఇక అమ్మ రాగానే అర్చన బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఫ్రీజ్ లేదు ఏం లేదు. అమ్మ రాగానే కౌగిలించుకుని ఏడుపు మొదలు పెట్టింది.  మళ్లీ అర్చన వాళ్లమ్మ వెళ్లేటప్పుడు ఫ్రీజ్ చేసేసిన బిగ్ బాస్..గేటు దగ్గరికి చేరుకోగానే అర్చనను రిలీఫ్ చేశారు ,దాంతో పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్లీ ఎత్తుకో అంటూ అమ్మను అడగటం.. అర్చనలోని మరో కోణాన్ని చూపిస్తుంది.

ఇక చివరగా బిగ్ బాస్ కు థాంక్స్ చెప్పిన అర్చన .. బిగ్ బాస్ చాలా గ్రహించాను. మనపై విమర్శలను సరిగ్గా తీసుకుని సరిదిద్దుకుంటే... మనకే మేలు జరుగుతుందని గ్రహించాను. ఈ జర్నీ అప్స్ అండ్ డౌన్స్ తో ఓ ఉగాది పచ్చడి లాంటిది అనిపించింది. అన్ని రుచులు కలిగిన జర్నీ నాది. చాలా బాగనిపించింది ఇప్పుడు చూస్తే. జీవితాంతం సరిపడే మెమరీస్ వున్నాయి. థాంక్యూ అనగానే ఫినాలేకు ఆల్ ద బెస్ట్ చెప్పారు బిగ్ బాస్.

 

ఆదర్శ్ జర్నీ...

ఆదర్శ్ గురించి చెప్తూ... తెరమీది కనిపించిన పాత్రల ఆధారంగా ఒకవిధమైన గుర్తింపుతో బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. కానీ మీరు నిజ జీవితంలో ఒక కుటుంబంగా ఎలా వుంటారని ప్రశ్నగా వుండేది. మీలో మరో కోణాఁన్ని బైటపడేసే ఘటనలు అప్పుడప్పుడు జరిగింది. ఒంటరిగా మొదలు పెట్టినా... ఆత్మీయుడైన మిత్రుడడుతో కలిసి ఒకరికి ఒకరు బలంగా నిలిచారు. కష్ట కాలంలో ధైర్యంగా వుండి ఆటను ముందుకు తీసుకెళ్లి ఉదాహరణగా నిలిచారు. మీ స్నేహితుడు వెళ్లినప్పుడు దానికి కారణం మీరే అని అందరూ మిమ్మల్ని నిందించారు. కానీ మీ రు చాలా బాధ ప్డాడరు. బిగ్ బాస్ మీరు బాధపడిన తీరును గమనించచారు. ముందుకు సాగారు. మీ ఆత్మీయయులు ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఆనందం కొత్త ఉత్సాహాన్ని నింపింది. మీ క్రీడా స్పూర్తి మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది. చివరై మైలురాయి. ఆల్ ద బెస్ట్ అన్నారు.

ఇక వీడియోలో.. ఆదర్శ్ భార్య,బిడ్డలు వచ్చినపుడు ఫ్రీజ్ లో వుండి ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ బాగానే మేనేజ్ చేశాడు. ఇక తాప్సీ వచ్చినప్పుడు ఆదర్శ్ ను స్పెషల్లీ కలవడానికి వచ్చానని చెప్పింది. తాప్సీని ఆదర్శ్ సతీమణి కలవడం, తనకు గిఫ్ట్ పంపడం వల్ల తాప్సీ అలా అంది. ఇక కత్తి మహేష్ ఆదర్శ్ బ్యాలెన్స్ డుగా వుంటాడని, కత్తి కార్తీక ఆదర్శ్ అన్న ఉత్తమ నటుడు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక కెప్టెన్సీ ఎవరు కావాలని అడిగినప్పుడు మెజారిటీ సభ్యులు ఆదర్శ్ ను కెప్టెన్ గా ఓటింగ్ లో ఎన్నుకున్నారు. ఇక ఓ సారి శివబాలాజీ, ఆదర్శ్ ల ఆర్గుమెంట్ కూడా వీడియోలో చూపించారు. అశలు నీదంతా హై డ్రామా.. మాట మీద నిలబడవు అంటూ శివబాలాజీ అదిపై గుస్సా అవంటం వీడియోలో చూపించారు. ఇక ప్రిన్స్ తోనూ ఓ సారి ఆర్గుమెంట్ జరిగింది. అప్పుడు నా ఆట నన్ను ఆడనియ్యి బై అంటూ.. ప్రిన్స్ ను వారించాడు ఆది. ఇక ఫ్రీజ్ టాస్క్ జరిగినప్పుడు ఆదిని  ఫ్రీజ్ నుంచి కన్ఫెషన్ రూమ్ కు పిలిచిన బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చినపుడు ఆది ఎమోషన్ ఆకట్టుకుంది. టఫ్ టైమ్స్  లోను బాగా ఆడావని బిగ్ బాస్ ఆదికి కితాబునిచ్చారు.

హరితేజ...ఇంటి గుండె చప్పుడు...

ఇక హరితేజని పిలిపించిన బిగ్ బాస్.. నువ్వు ఇంటి గుండె చప్పుడు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంట్లో సరదాకి సంబరానికి కారణం అన్నారు. బలమైన పోటీదారు. నిస్వార్ధంగా ఆలోచించావన్నారు. అందరితో స్నేహంగా వున్నారు. అయితే తప్పును తప్పు అని చెప్పడంలో వెనుకాడలేదు. తెలుగు వారికి వినోదం పంచడడంలో బిగ్ బాస్ ఇంట్లో మీ తరువాతే ఎవరైనా... వినోదభరితులైన కళాకారిణి అయిన మీకు బిగ్ బాస్ సెల్యూట్ అన్నారు.

ఇక వీడియోలో... జర్నీ మొదలైన దగ్గర్నుంచి వేస్తూ.. మధ్యలో..కార్తీక నాగురించి ఫీలింగ్ అన్ కంఫర్టబుల్ అనట దానికి అసలు నాకు ఆ థాట్ కూడా లేదు అని కత్తి కార్తిక అనటం కనిపించింది. ఇక ముమైత్ ఖాన్ కూడా నాపై జోక్స్ వేయద్దని హరితేజకు వార్నింద్ ఇవ్వడం... ఇవన్నీ వీడియోలో వున్నాయి. ఇక ఎలిమినేషన్ కు కత్తి కార్తీక హరితేజను నామినేట్ చేయటం..బత్తులు ఎక్కిస్తా వుంటదని చెప్పడం వీడియోలో కనిపించింది. ఇదంతా గతంలో జరిగిన ఎపిసోడ్ లోనివే.

ఇక హరితేజ వివిధ టాస్క్ లలో ఫన్నీ యాక్ట్స్ చేస్తూ కనిపించింది. కెప్టెన్ అయినాక రైడ్ ద సైకిల్ సుబ్బలక్ష్మి అంటూ..పాట పాడింది. శివబాలాజీ పప్పు అన్నం వండి పెట్టిన తీరు ను ప్రసంశించింది. తర్వాత శివ,హరితేజల చిలిపి గొడవలు, స్కూళ్లో అమ్మ గురించి చెప్పడం., లవ్ యు అమ్మ అనడం.. గుర్తు కొస్తున్నాయి పాటతో పండించారు. తర్వాత హరితేజ భర్త వచ్చినప్పుడు, అమ్మ గురించి ఏడ్చినప్పుడు., కత్తి మహేష్ తో శివబాలాజీతో పారాయ్ పాటకు నర్తించినప్పుడు, బుర్ర కథ చెప్పినప్పుడు ఇలా ఇలా జర్నీ ని అందంగా వీడియో లో చూపించారు. దీంతో కంటతడి పెట్టిన హరి.... ఇంతకు మించిన హాపీనెస్ ఏముండదు. మనసు గెలుచుకున్నారు. నా బాధ ఎవరితో పంచుకోలేదని అన్నారు గానీ... మీరు అర్థం చేసుకున్నారని వీడియో చూశాక తెలిసింది. థాంక్యూ బిగ్ బాస్.. లైఫ్ అంతా నెమరు వేసుకోవడానికి సరిపడా  తీపి గురుతులు అందించారు అంటూ హరితేజ కాస్త ఎమోషన్ అయింది.

శివ బాలాజీ...

హౌజ్ లో మీరు చాలా సరదాగా కనిపించారు. ఇంటి సభ్యులు మిమ్మల్ని కోపిష్టి లాగానే చూశారు. మీలో దాగివున్న మానవత్వాన్ని, జాలి గుణాన్ని చూసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అందరూ మీ కోపం గురించే పదేపదే ప్రస్తావిస్తే మీరు బాధ పడ్డారు. హౌజ్ మేట్స్ కోసం చేసిన వంటలో మీ ప్రేమ ప్రదర్శించారు. టాస్క్ లో రోజు రోజుకి మీ ప్రదర్శన మెరుగు పడుతతూ వచ్చింది. ఓపిగ్గా వుంటూ సహనం కోల్పోకుండా చక్కని ప్రయాణం చేసి చివరి వారానికి చేరిన మొదటి ఇంటి సభ్యుడుగా మారారు. మిమ్మల్ని మీరు మార్చుకుని ఆటలో చక్కగా నిలదొక్కుకున్నందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఈ ప్రయాణంలో చివరి మైలురాయిని చేరుకున్నారు. ఇప్పటి వరకు మీ ప్రయాణం చూద్దాం అంటూ వీడియో చూపించారు.

 

ఎంట్రీలో పట్టు పంచెలో వచ్చారు శివబాలాజీ. దీంతో ఏంటా మీసం బిగ్ బాస్ అనా..అంటూ ఎన్టీఆర్ చమత్కరించడం అనంతరం హౌజ్ లోకి శివబాలాజీ వెళ్లడం జరిగింది. ఆ తర్వాత... నేను ముమైత్ వైపుంటా అని శివబాలాజీ ఓ సందర్భంలో చెప్పడం, మీడియేషన్ చేయను, ఆ అలవాటు లేదనటం, శివబాలాజీ బిగ్ బాస్ పై కెమెరాలో కోపాన్ని చూపించడం..వీడియోలో చూపించారు. ఇక తాప్సీ వచ్చినపుడు శివబాలాజీ నువ్వే సూపర్ స్టార్ అన్న కితాబు, ముమైత్ చెప్పింది రైటే వుంటదంటూ పంపిన టీ షర్ట్ వేసుకున్న శివబాలాజీ. ఆధర్శ్ తో మాట్లాడుతూ... నీ కేరక్టర్ ఏంటో చెప్పాను కదా. ఏడుపు తప్ప ఏమీలేదు. ఏం కేరక్టరయ్యా...అని అరవటం చూపించారు. తర్వాత బాధనిపిచ్చి అలా అన్నానంటూ ఆదర్శ్ కు సారీ చెప్పాడు. ఆ తర్వాత మరో సందర్భంలో ప్రిన్స్ తో వాగ్వాదం, ఆ తర్వాత మిరపకాయల దండలతో ఎలిమినేషన్ నామినేషన్ జరిగినప్పుడు నవదీప్, ప్రిన్స్, ఆదర్స్ తదితరులు శివబాలాజీని నామినేట్  చేయటం, తాను ఇష్టపడే ముమైత్ తోనూ చివరకు ఆర్గుమెంట్ పెట్టుకోవడం, హుర్రకథలో భాగంగా మీసాలు రింగుల జుట్టుంటే వాన్ని అస్సలు నమ్మకురా. అంటూ శివబాలాజీ గురించి పాడిన బుర్రకథ పాట, దీక్ష శివబాలాజీకి మద్దతిచ్చిన తీరు.. హౌజ్ లో నీళ్లు మురికిగా వస్తే బిగ్ బాస్ నిర్వాహకులపై కోపం ప్రదర్శించిన తీరు. హరితేజతో కలిసి కోతి, కోతిని ఆడించే వాడి పాత్ర, హరితేజ భర్త వచ్చి తనను కొట్టడంపై శివబాలాజీని ప్రశ్నించడం, స్వప్న మాధురి రాకతో కౌగిలిలో బంధించిన వైనం అన్నీ వీడియోలో చూపించారు. దీంతో థాంక్స్ బిగ్ బాస్. చాలా హార్ట్ టచింగ్. లైఫ్ అంతా గుర్తుపెట్టుకునేలా వుంది అంటూ శివ బాలాజీ వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత హౌజ్ లోకి రాగానే శివబాలాజీతో హరితేజ వీడియో గురించి చర్చ మొదలు పెట్టింది. రొమాంటిక్, కోపం, ఇలా రకరకాల ఎమోషన్స్ చూపించారంటూ చెప్పుకొచ్చాడు శివబాలాజీ. అయితే ఇప్పటి వరకూ బిగ్‌బాస్ హౌస్‌లో కోపిష్ఠిగా ఉంటూనే ​ ప్రేక్షకుల హృదయాలను గెలిచుకున్న శివబాలాజీ తన వీడియోని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులు ఎమోషన్ ఫీల్ అయ్యేట్టు చేసింది. మరి రేపటి ఎపిసోడ్‌లో అర్చన కెప్టెన్ గా వున్నా.., హౌజ్ లో ముగ్గురు రోమియోలు..ఒక జూలియట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే హరితేజను ఈ టాస్క్ లో ఇన్వాల్వ్ చేయకపోవడంతో బాగానే హర్ట్ అయినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి ఎలా సాగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios