బిగ్ బాస్ హౌస్ లో హిజ్రా ఎంట్రీ!

bigg boss malayalam: transgender actress Anjali Ameer steps in as the new wild card
Highlights

బిగ్ బాస్ హౌస్ నుండి నటి శ్వేతామీనన్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఆ షోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హిజ్రా కం నటి అంజలి అమీర్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మమ్ముట్టి నటించిన 'పెరంబు' అనే చిత్రంలో కథానాయికగా నటించింది అంజలి.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న ఈ షోని తెలుగులో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో మంచి ఎంటర్టైన్మెంట్. ప్రతి వారం కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం జరుగుతుంటుంది. తాజాగా మలయాళ బిగ్ బాస్ హౌస్ నుండి నటి శ్వేతామీనన్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఆ షోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హిజ్రా కం నటి అంజలి అమీర్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

మమ్ముట్టి నటించిన 'పెరంబు' అనే చిత్రంలో కథానాయికగా నటించింది అంజలి. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడిప్పుడే నటిగా చక్కటి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమయింది. మరి హౌస్ లో ఆమె ఎలా  ఉంటుందో చూడాలి. మళయాలం బిగ్ బాస్ షోని స్ఫూర్తిగా తీసుకొని తమిళ, తెలుగు భాషల్లో కూడా హిజ్రాలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారా..? అనే సందేహాలు కలుగుతున్నారు. 

loader