ప్రేమ పేరుతో మోసాలు సమాజంలో నిత్యకృత్యం అవుతున్నాయి. అమాయకులతో పాటు అన్నీ తెలిసిన సెలబ్రిటీలు కూడా మాయగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ ప్రేమికుడి చేతిలో ఘోరంగా మోసపోయారు .  

తమిళ బిగ్ బాస్ ఫేమ్ నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జూలియానా చీటింగ్ కి గురయ్యారు. నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్న మనీష్ ఆమె ఇంటిలోని నగదు, బంగారం, విలువైన వస్తువులతో పారిపోయాడు. మనీష్ చేతిలో మోసపోయానని తెలుసుకున్న జూలీ... తమిళనాడు పోలీసులను ఆశ్రయించారు. అలాగే మనీష్ పై కంప్లైంట్ ఇచ్చారు. జూలీ చెబుతున్న వివరాల ప్రకారం నాలుగేళ్ళ క్రితం మనీష్ తో జూలీకి పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. 


త్వరలో పెళ్లి కూడా చేసుకుందామని మనీష్, జూలీతో చెప్పాడు. దీంతో అతడిని ఆమె గుడ్డిగా నిమ్మంది. అదను చూసుకొని మనీష్ ఆమె ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. డబ్బులతో పాటు విలువైన వస్తువులు, ఆభరణాలు తీసుకొని పారిపోయాడు. మోసపోయానని తెలుసుకున్న జూలీ అతని కోసం వెతికింది. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Also read బెడ్‌రూమ్‌ సీన్‌లో రెచ్చిపోయి బిగ్‌బాస్‌ బ్యూటీ దివి.. రొమాంటిక్‌ సీన్‌లో అలా కనిపించి షాకిస్తున్న అందాల సోయగం
కాగా జూలీ కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ్ బిగ్‌బాస్‌ షో మొదటి సీజన్‌కి సాధారణ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చింది. గతంలో చెన్నైలో జరిగిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఆమె ఫేమస్‌ అయింది. ఆ ఉద్యమంలో ఆమె చేసిన నినాదాలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. దీంతో జూలీకి బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. అయితే షోలోకి వెళ్లిన కొద్ది రోజులకే తోటి కంటెంస్టెంట్‌తో గొడవపడి మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ లక్షలాది అభిమానులకు సంపాదించుకుంది. సోషల్‌ మీడియాలో కూడా జూలీ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. 

Also read Bigg Boss Telugu 5: షన్ను జీవితాంతం ఏడిపిస్తాడు.. సిరి బోల్డ్ స్టేట్‌మెంట్‌.. రచ్చ మళ్లీ షురూ.. టాప్‌ 6 వీళ్లే