సోమవారం ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌, సిరిల మధ్య గొడవ మళ్లీ మొదటికొచ్చింది. సిరి విషయంలో తను సీరియస్ అయ్యాడు. తామిద్దరి మధ్య ఏదో ఉందనేది క్రియేట్‌ చేయాలనుకుంటున్నారని, వాళ్లకి ఛాన్స్ ఇస్తున్నావని సిరిని ఉద్దేశించి షణ్ముఖ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5).. 14వ వారానికి చేరుకుంది. ఇక గేమ్‌ కేవలం ఒక్క వారామే ఉంది. మరో వారం డైరెక్ట్ గా టాప్‌ ఫైవ్‌.. టైటిల్‌ కోసం పోటీపడతారు. విన్నర్‌ ఎవరనేది తెలుస్తుంది. అందులో భాగంగా సోమవారం(91) ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నారు. ఆదివారం అంతా ఊహించినట్టే ప్రియాంక హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. ప్రస్తుతం హౌజ్‌లో సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్‌, మానస్‌, సిరి, కాజల్‌ ఉన్నారు. 

ఇక సోమవారం Bigg Boss Telugu 5 ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌(Shanmukh), సిరి(siri)ల మధ్య గొడవ మళ్లీ మొదటికొచ్చింది. సిరి విషయంలో తను సీరియస్ అయ్యాడు. తామిద్దరి మధ్య ఏదో ఉందనేది క్రియేట్‌ చేయాలనుకుంటున్నారని, వాళ్లకి ఛాన్స్ ఇస్తున్నావని సిరిని ఉద్దేశించి షణ్ముఖ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. బయటకు వెళ్తితే రాంగ్‌ ఇంప్రెషన్‌ పడుతుంది, బ్యాడ్‌గా అనుకుంటారని ఆమెకి పదే పదే చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా ఉండకూదడని, తనకు దూరంగా ఉండాలని తెలిపారు షన్ము. దీంతో వీడేంటో, ఎందుకు ఇలా మాట్లాడతాడో అర్థం కాడంటూ ఆవేదన చెందింది. తనలో తాను బాధపడింది. షన్ముని ఓ హెడేక్‌గా ఫీలయ్యింది. 

అనంతరం ఉన్న ఆరుగురిలో టాప్‌ 6లో ఎవరెవరు ఏ స్థానానికి అర్హులో, ఎవరు టాప్‌ 5లో ఉండకూడదో నిర్ణయించుకుని ఆయా స్థానాల్లో నిలబడాలని బిగ్‌బాస్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఇంటి సభ్యుల మధ్య చాలా సేపు డిస్కషన్‌ జరిగింది. మొదట ఎవరికి వాళ్లు తాము ఫస్ట్ ప్లేస్‌లో ఉంటామని అనుకున్నారు. ఆ తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్నారు. చాలా డిస్కషన్ తర్వాత ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా మొదటి స్థానాన్ని సన్నీకి ఇచ్చారు. రెండో స్థానం షణ్ముఖ్‌, కాజల్‌ మూడో స్థానం, శ్రీరామ్‌కి నాలుగో స్థానం, మానస్‌కి ఐదో స్థానం, సిరికి ఆరో స్థానం ఇచ్చారు. 

అయితే సిరి ఆరో స్థానం తీసుకోవడానికి సంబంధించి మానస్‌, సిరిల మధ్య డిస్కషన్‌ జరిగింది. అయితే తాను ఆరో స్థానం తీసుకోవడానికి కారణమేంటో చెప్పింది. పేరెంట్స్ వచ్చినప్పుడు తన పేరెంట్స్ తప్ప మరెవ్వరూ తనకి టాప్‌ 5లో స్థానం ఇవ్వలేదని అందుకే ఆరో స్థానం తీసుకున్నట్టు చెప్పింది. అయితే షణ్ముఖ్‌కి కాజల్‌ ఆరో స్థానం ఇచ్చింది. అందుకు కాజల్‌ ఇవ్వడం వల్లే తాను ఆరో స్థానంలో నిలబడతానని చెప్పాడు. ఈ విషయంలో కాజల్‌ వారించింది. ఇదంతా జరిగిన తర్వాతనే ఫైనల్‌గా వారి స్థానాలను ఎంపిక చేశారు. ఇలా టాప్‌ వన్‌లో సన్నీ నిలిచారు. 

ఇక ఈ వారం నామినేషన్లకి సంబంధించి బిగ్‌బాస్‌ చెబుతూ, శ్రీరామ్‌ డైరెక్ట్ గా ఫైనలిస్ట్ అయిన నేపథ్యంలో మిగిలిన ఐదుగురు సన్నీ, మానస్‌, షణ్ముఖ్‌, కాజల్‌, సిరి ఈ వారం నామినేషన్‌లో ఉంటారని తెలిపారు. అనంతరం కాజల్‌, షణ్ముఖ్ ల మధ్య డిస్కషన్‌ జరిగింది. తాను ఆరోస్థానం ఇస్తే నువ్వు ఉండటమేంటని షన్నుని ప్రశ్నించింది కాజల్‌. అప్పటి వరకు వారిద్దరి మధ్య డిస్కషన్‌ బాగానే జరిగింది. కానీ తర్వాతే హీటెక్కించింది. కాజల్‌ బాగా యాటిట్యూడ్‌ చూపిస్తుందని షన్ను ఆరోపించారు. మార్నింగ్‌ గుర్తు చేయాలని, లేకపోతే నాకు కాల్తది అనడాన్ని తప్పుపట్టారు. దీనికి సిరి స్పందిస్తూ ఓవర్‌ కాన్ఫిడెన్స్ వచ్చిందని తెలిపింది. దీంతో చూద్దాం ఏం జరుగుతుందో అని తెలిపింది. 

మరోవైపు టాప్‌ 6 నిర్ణయించేటప్పుడు సిరి.. ఫస్ట్ ప్లేస్‌ షణ్ముఖ్‌కి ఇచ్చింది. తాను ఇవ్వడానికి కారణం చెబుతూ, మొదటి వారంలో సరయు తనపై విమర్శలు చేసిందని, మేమిద్దరం కలిసి ఆడుతున్నామని చెప్పింది. దీంతో తనకు హౌజ్‌ నుంచి వెళ్లిపోవాలని, ఈ హౌజ్‌కి తాను ఫిట్‌ కాదని మనసులో అనుకున్నట్టు చెప్పింది. అయితే తన ఆలోచనలను షన్ను మార్చాడని, ఆయనతో గొడవ జరుగుతూనే ఉంటుందని, ఇప్పటి కూడా గొడవ అయ్యిందని, తనన జీవితాంతం ఏడిపిస్తాడని స్టేట్‌మెంట్ ఇచ్చింది సిరి. ఇది అందరిని ఆశ్చర్యపరిచింది. 

also read: Bigg Boss Telugu 5: వాస్తవం తెలుసుకో ప్రియాంక... తర్వాత నీ హృదయం బద్దలవుతుంది!