బిగ్ బాస్ సీజన్ 4కి గాను హౌస్ లోకి ప్రవేశించిన కంటెస్టెంట్స్ లో గంగవ్వ ప్రత్యేకంగా నిలిచారు. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న గంగవ్వ, హౌస్లో ఉంది కొన్ని వారాలే అయినా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ అట తీరు ఆకట్టుకుంది. ఐతే హౌస్ లో గంగవ్వ ఆరోగ్యం పాడవడంతో పరీక్ష చేసిన వైద్యులు, ఆమె అభ్యర్ధన మేరకు ఇంటి నుండి బయటికి పంపించారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గంగవ్వ కోరుకున్నట్లు ఇల్లు కట్టిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత గంగవ్వ పాపులారిటీ మరింత పెరుగగా...బుల్లితెరపై అనేక కార్యక్రమాలలో కనిపిస్తున్నారు. 
 
గంగవ్వ పలు ఛానల్స్ కి వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన గంగవ్వ చందన బ్రదర్స్ కి వెళ్లి షాపింగ్ చేశారు. ఆమె లక్షల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. గంగవ్వ షాపింగ్ చేయడానికి కూడా కారణం బిగ్ బాస్ షోనే. గంగవ్వ హౌస్ లో ఉండగా చందన బ్రదర్స్ వారి సౌజన్యంతో ఫ్యాషన్ షో నిర్వహించారు. చందన బ్రదర్స్ వారి బట్టలు ధరించిన ఇంటి సభ్యులు ర్యాంప్ వాక్ చేశారు. 
 
ఈ ఫ్యాషన్ షోలో విజేతలకు లక్షల రూపాయల షాపింగ్ చెక్ ని చందనా బ్రదర్స్ వారు ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ షోలో విజేతగా ఇంటి సభ్యులు ఏకగ్రీవంగా గంగవ్వను నిర్ణయించారు.ఆ షాపింగ్ చెక్ తో లక్ష రూపాయాలకు సమానమైన గోల్డ్ కాయిన్స్ గంగవ్వ తీసుకున్నారు. రెండు తులాల బరువైన ఆ బంగారంతో మెడకు తీగ చేయించుకుంటానని గంగవ్వ చెప్పారు. ఇక షాప్ కి వచ్చిన కస్టమర్స్ తో పాటు.. సిబ్బంది గంగవ్వతో ఫోటోలకు పోజులివ్వడం విశేషం.