బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్‌లో ఇండియాలో ఎప్పుడూ జరగని ఓ విశేషం జరిగింది. గ్రాండ్ ఫినాలేలో టాప్ 2లో ఉన్న వారు ప్రైజ్ మనీ తీసుకుని అంచనాలను తారు మారు చేయడం ఈ సీజన్‌లోనే చోటు చేసుకుంది. నాగార్జున ఇచ్చిన చివరి ఆఫర్ రూ.40లక్షలను శ్రీహాన్ తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో రేవంత్ విన్నర్ అయ్యారు. ఈ ప్రకారంగా ఆయనకు 10 లక్షల ప్రైజ్ మనీ, సువర్ణభూమి ఫ్లాట్, బ్రీజా కారుతోపాటు ట్రోఫీ దక్కనుంది.
ఇదిలా ఉంటే చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ అసలు విన్నర్ ఎవరో తేల్చారు. అతి చిన్న ఓటింగ్ తేడాతో ఈ సీజన్ శ్రీహాన్ విన్నర్‌గా నిలిచారని తెలిపారు. దీంతో శ్రీహాన్ ఆనందానికి అవద్దుల్లేవని చెప్పొచ్చు. అయితే తాను నాగ్ ఆఫర్‌కి టెంప్ట్ అయి రేవంత్‌కి పెద్ద హెల్ప్ చేశాడు శ్రీహాన్. తనతో సమానంగా మనీ వచ్చేలా చేశారు. తనకు తెలియకుండా చేసినా, గొప్ప హెల్ప్ చేశాడని చెప్పొచ్చు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, తనని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. ఏదో రాసి పెట్టి ఉంటేనే ఇక్కడి వరకు వస్తామన్నారు. పేరుతోనే పాపులారిటీ వస్తుందని, దీంతో ఆటోమెటిక్‌గా డబ్బు వస్తుందన్నారు. తాను సాధిస్తానని నమ్మానని, చివరికి సాధించానని చెప్పారు రేవంత్. ఈ ట్రోఫీని ఇంట్లో లక్ష్మీదేవికి ఇస్తానని(తనకు ఇటీవల కూతురు పుట్టిన విషయం తెలిసిందే), ఇకపై లక్ష్మి వస్తూనే ఉంటుందన్నారు రేవంత్.
శ్రీహాన్ మాట్లాడుతూ, ఆడియెన్స్ కి, బిగ్ బాస్‌కి, నాగార్జునకి థ్యాంక్స్ చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన పేరెంట్స్ కి రుణపడి ఉంటానన్నారు. బిగ్ బాస్ షో మంచి ఫ్రెండ్‌ని ఇచ్చిందని చాలా ఆనందంగా ఉందని తెలిపారు శ్రీహాన్
