బిగ్ బాస్2: తేజస్వి ఔట్.. వెళ్తూ వెళ్తూ కౌశల్ కి పంచ్

bigg boss 2: tejaswi eliminated
Highlights

బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న తేజస్వి ఆరో ఎలిమినేషన్ లో బయటకు రావడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తేజస్వి బయటకి రావడంతో హౌస్ లో ఉన్నవారంతా చాలా ఎమోషనల్ అయ్యారు. 

బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం(జూలై 22) ఎపిసోడ్ తో ఆరు వారాలను పూర్తి చేసుకుంది. ఈరోజు ఎపిసోడ్ లో లక్ష్మీ మంచు 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ తో సరదాగా గడిపింది. ఆపై ఈరోజు ఎలిమినేషన్ లో బయటకు వచ్చేది ఎవరనే విషయాన్ని రివీల్ చేశాడు నాని. నిన్న ఎపిసోడ్ లో సామ్రాట్, తేజశ్విలు మాత్రమే ఎలిమినేషన్ జోన్ లో ఉంచాడు నాని.

ఈ ఇద్దరిలో నిన్నటిదాకా సామ్రాట్ ఎలిమినేట్ అని వార్తలు రాగా ఫైనల్ గా తేజశ్వి బయటకు బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న తేజస్వి ఆరో ఎలిమినేషన్ లో బయటకు రావడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తేజస్వి బయటకి రావడంతో హౌస్ లో ఉన్నవారంతా చాలా ఎమోషనల్ అయ్యారు. సామ్రాట్, తనీష్ లు కంటతడి పెట్టడంతో కొంతసమయం పాటు షో చాలా ఎమోషనల్ గా సాగింది.

ఇక స్టేజ్ పైకి వచ్చిన తేజస్విని బిగ్ బాంబ్ కోసం నాని హౌస్ లో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోమని చెప్పగా.. తేజస్వి తెలివిగా గణేష్ పేరు చెప్పింది. ఈ వారం మొత్తం గణేష్ చిన్నపిల్లలు పాలు తాగే పాలసీసాలో మంచి నీళ్లు తాగాలి. అయితే ఇది హౌస్ లో ఉన్న పెద్దవాళ్లకు ఇస్తే మరింత ఫన్ గా ఉండేదని కానీ తేజస్వి తెలివిగా గణేష్ పేరు చెప్పిందని నాని అన్నారు. ఇక తేజస్వి వెళ్లిపోతూ.. వెళ్లిపోతూ.. కౌశల్ కి 'నువ్వు బిగ్ బాస్ షో గెలుస్తావేమో.. కానీ నేను హౌస్ లో ఉన్నవారి మనసులను గెలుచుకున్నాను' అంటూ కామెంట్ చేసింది. 

loader