బిగ్ బాస్2: కిరీటి ఔట్.. ఈ వారం గీతామాధురి కష్టాలు

First Published 2, Jul 2018, 11:00 AM IST
Bigg Boss 2: Kireeti Damaraju eliminated, Bigg bomb dropped on Geetha
Highlights

ఇక వెళ్లిపోతూ వెళ్లిపోతూ కిరీటి బిగ్ బాంబ్ ను గీతామాధురిపై విసిరాడు

రియాలిటీ షోలో పాపులర్ అయిన బిగ్ బాస్ షో తెలుగు సీజన్ 2 మొదలై ఇప్పటికే మూడు వారాలు పూర్తయింది. మొదటి రెండు వారాల్లో సంజన, నూతన్ నాయుడులు ఎలిమినేట్ కాగా, మూడో వారంలో ఎవరు వెళ్లిపోతారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఈసారి హౌస్ నుండి విజయవాడ నుండి వచ్చిన గణేష్ బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే కామెంట్లు ఎక్కువగా వినిపించాయి.

కానీ కిరీటి హౌస్ లో తెలియకుండా చేసిన ఓ తప్పిదం కారణంగా మిగిలిన హౌస్ మెంబర్స్ అందరూ అతడినే నామినేట్ చేశారు. అలానే ఓట్ల సంఖ్య కూడా తక్కువగా ఉండదడంతో కిరీటి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అలా వెళ్లిపోయిన కిరీటీ చాలా ఎమోషనల్ అయ్యాడు. తనీష్ కు తన గుర్తుగా ఒక జాకెట్ ను ఇచ్చాడు. హౌస్ లో మిగిలిన వారంతా కూడా కిరీటీ చాలా సెన్సిటివ్ అని ఎవరినీ నొప్పించే తత్వం కాదని కాకపోతే తెలియకుండా అతడు చేసిన కొన్ని తప్పులు ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

ఇక వెళ్లిపోతూ వెళ్లిపోతూ కిరీటి బిగ్ బాంబ్ ను గీతామాధురిపై విసిరాడు. దాని ప్రకారం ఈ వారం మొత్తం గీతామాధురి బాక్సింగ్ గ్లౌజ్ వేసుకొనే అన్ని పనులు చేయాలి. బాత్రూమ్ కు వెళ్లే సమయంలో తప్ప పడుకునేప్పుడు కూడా ఆమె గ్లౌజ్ ధరించే ఉండాలని సూచించారు. 

loader