బిగ్ బాస్2: స్టార్లు ఎక్కడ?

Bigg Boss 2: Contestants Lack Star Appeal
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. పార్టిసిపెంట్లుగా పలువురు పేర్లు 

బిగ్ బాస్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. పార్టిసిపెంట్లుగా పలువురు పేర్లు వినిపించగా.. నిన్నటితో ఆ సస్పెన్స్ రివీల్ అయింది. అయితే కంటెస్టంట్ల సెలెక్షన్ పై ప్రజల అంచనాలకు రీచ్ కాలేకపోయారు నిర్వాహకులు. స్టార్ డమ్, క్రేజ్ ఉన్న తారలు కనిపించకపోవడంతో పెదవి విరుపులు తప్పడం లేదు. నిజానికి సీజన్2 లో కాస్త ఫేమ్ ఉన్న నటులు ఉన్నపటికీ ఆడియన్స్ లో అంచనాలను ముందు నుండి పెంచేయడంతో వాటి ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకోలేకపోయారు.

నిజానికి బిగ్ బాస్ సీజన్1 కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొందనే చెప్పాలి. అయితే తెలుగులో మొదటి రియాలిటీ షో కావడంతో స్టార్లు ఎవరూ పాల్గొనడానికి సాహసించలేదని అనుకోవచ్చు. పోనీ కనీసం రెండో సీజన్ లో అయినా.. పేరున్న వాళ్లని స్టార్లను తీసుకొస్తారనుకుంటే ఈసారి కూడా నిరాశ తప్పలేదు. షోలో ఆసక్తికరంగా ఒక్క కంటెస్టంట్ కూడా కనిపించకపోవడం నిరాశ కలిగిస్తుంది.

మొదటి షోలో అంటే ఎన్టీఆర్ తన వాక్చాతుర్యంతో షోను తన భుజాలపై నడిపించాడు. మాస్ లో విపరీతమైన ఆదరణ లభించింది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో నాని వచ్చాడు. షోలో స్టార్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ సీజన్ కు నిర్వాహకులు ఆశించే రేటింగ్స్ లభిస్తాయో లేదో చూడాలి!
 

loader