హిందీ బిగ్ బాస్ సీజన్ 12 వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. రోజురోజుకి హౌస్ లో పరిస్థితులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన శ్రీశాంత్ మొదటి నుండి తన ప్రవర్తనతో ఏదొక గొడవలకు కారణమవుతూనే ఉన్నాడు.

ఇటీవల శ్రీశాంత్ కి హౌస్‌మేట్ సురభి రానాతో గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు వ్యక్తిగతంగా దూశించుకునే రేంజ్ కి గొడవ వెళ్లింది. శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సర్ అని, చీటర్ అని సురభి అతడిని తక్కువ చేసి మాట్లాడింది. ఆమె మాటలకు సహనం కోల్పోయిన శ్రీశాంత్ కోపంతో సురభిని వ్యభిచారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

అయితే తను తొందరపడి అన్న మాటలకూ పశ్చాతాపంతో సురభికి క్షమాపణలు చెప్పాడు. ఆ బాధతో కుంగిపోయిన శ్రీశాంత్ బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకొని తన తలను గోడకేసి బాదుకున్నాడు. గాయపడిన శ్రీశాంత్ ని బిగ్ బాస్ నిర్వాహకులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు.

ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత తిరిగి బిగ్ బాస్ హౌస్ కి చేరుకున్నాడు శ్రీశాంత్.శ్రీశాంత్ క్షేమంగా ఉన్నారని అతడి భార్య భువనేశ్వరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తమకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది. 

ఇవి కూడా చదవండి.. 

హీరోయిన్ భర్తపై శ్రీశాంత్ భార్య ఫైర్!

బిగ్ బాస్: కూతురి యూనిఫామ్ చూసి ఏడ్చేసిన శ్రీశాంత్!

బాత్రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్!

బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్.. కారణమేమిటంటే..?