బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గత వారం ఆయన హౌస్ లో  ప్రవర్తించిన తీరును హోస్ట్ సల్మాన్ ఖాన్ వారాంతంలో ప్రశ్నించారు.

శ్రీశాంత్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. దీంతో బాధ తట్టుకోలేక శ్రీశాంత్ వాష్ రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడవడం పలువురిని కంటతడి పెట్టేలా చేసింది. అసలు విషయంలోకి వస్తే.. సల్మాన్ ఖాన్ వారంలో హౌస్ లో జరిగిన అన్ని వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశాంత్ ను ఖల్ నాయక్ కుర్చీపై కూర్చోబెట్టారు.

ఆ తరువాత సల్మాన్.. శ్రీశాంత్ ని పలు ప్రశ్నలు అడిగారు. దీనికి సమాధానంగా శ్రీశాంత్ తనకు సమాధానాలు తెలియవని, బిగ్ బాస్ నే అడిగి తెలుసుకోండని అన్నారు. దీంతో సల్మాన్ ఖాన్.. శ్రీశాంత్ కి క్లాస్ పీకారు.

బాధని తట్టుకోలేని శ్రీశాంత్ బాత్రూంలోకి వెళ్లి గుక్క పెట్టి మరీ ఏడ్చారు. ఆ తరువాత శ్రీశాంత్ ని జైలు పంపించడంపై మరో వివాదం చెలరేగింది. తాను జైలుకి వెళ్లడంపై శ్రీశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో కంటెస్టెంట్ అతడికి నచ్చజెప్పడంతో శ్రీశాంత్ అంగీకరించారు. 

సంబంధిత వార్త.. 

బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్.. కారణమేమిటంటే..?