దానయ్యపై నెగెటివ్ ప్రచారం.. ఆ హీరో టీమే కారణమా..?

big star close friends behind rumours about producer danayya?
Highlights

దానయ్య తను ఎవరికీ బాకీ పడలేదని తన టీమ్ అందరికీ రెమ్యునరేషన్ ఇచ్చేశానని వెల్లడించారు. కొరటాల శివ, కైరా అద్వానీ కూడా ఈ విషయంలో దానయ్యను సపోర్ట్ చేశారు

కొద్దిరోజులుగా నిర్మాత దానయ్యపై ఇండస్ట్రీలో నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. ఆయన మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమాను నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే సినిమాను డైరెక్ట్ చేసిన కొరటాల శివకు, హీరోయిన్ కైరా అద్వానీ అలానే కొందరు సాంకేతిక నిపుణులకు దానయ్య రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని వార్తలు ఊపందుకున్నాయి.

నిజానిజాలు చర్చించకుండా దాదాపు అన్ని మీడియా వర్గాలు కూడా ఈ విషయాన్ని ప్రచురించాయి. ఈ విషయంపై స్పందించిన దానయ్య తను ఎవరికీ బాకీ పడలేదని తన టీమ్ అందరికీ రెమ్యునరేషన్ ఇచ్చేశానని వెల్లడించారు. కొరటాల శివ, కైరా అద్వానీ కూడా ఈ విషయంలో దానయ్యను సపోర్ట్ చేశారు. కైరా అద్వానీ అయితే దానయ్య నిర్మాణంలో సమస్యలు ఉంటే నేను మరో సినిమా ఎందుకు చేస్తానని ప్రశ్నించింది. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నట్లు సమాచారం. దీనివెనుక ఓ పెద్ద స్టార్ సహచరులు ఉన్నారని తెలుస్తోంది.

వారు కావాలనే దానయ్యపై ఈ విధమైన నెగెటివ్ ప్రచారం చేస్తున్నారట. ఈ విషయం సదరు స్టార్ కు మాత్రం తెలియదట. తెలిసేలోగా ఈ విషయం ముదిరిందని  ఫిలిం నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఆ స్టార్ సన్నిహితులు ఇలా దానయ్య ఇమేజ్ ను ఎందుకు చెడగొట్టాలనుకున్నారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రస్తుతం దానయ్య.. రామ్ చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత రాజమౌళి రూపొందించనున్న మల్టీస్టారర్ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. 

loader