16 మంది పోటీదారులతో బిగ్ బాస్2 షో మొదలైంది. నేడు ఈ రియాలిటీ షో రెండో ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. అయితే తొలిరోజు సెలబ్రిటీలందరూ కలిసి సంజనా, నూతన్ నాయుడులను బిగ్ బాస్ జైలులో ఉండడానికి నామినేట్ చేశారు. దీంతో రెండో రోజు కూడా వీరిద్దరూ జైలులోనే గడపాల్సి వచ్చింది. హౌస్ లో మొదటిరోజే జైలులో ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేసింది మోడల్ సంజన.

సెలబ్రిటీలు అంటే ముందుగా వారంతా సామాన్యులతో కలవాలి అలాంటిది వాళ్లు ముందే సెపరేట్ చేసేస్తున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక నటుడు కిరీటీ ఏ సినిమాలలో నటించారో తనకు తెలియదని అతడిని అడిగి తెలుసుకుంది. దీప్తి సునైనా ఎవరో కూడా తనకు తెలియదని ఆన్ లైన్ లో చెక్ చేస్తే అందరూ ఆమెను బనానా అని పిలుస్తుండడంతో అలా ఎందుకు పిలుస్తున్నారో ఆమెను అడిగింది. దీనికి సమాధానంగా దీప్తి ''సోషల్ మీడియాలో ఆ పేరుతో తనను ట్రోల్ చేస్తుంటారని సునైనా రైమింగ్ కు బనానా సెట్ అవుతుందని అలా అంటుంటారని'' దీప్తి సునైనా వెల్లడించింది.

జైలులో ఉన్న ఇద్దరిలో ఒకరిని బయటకు తీసుకువచ్చే ఛాన్స్ హౌస్ లో ఉన్న మిగిలినవారికి ఇవ్వగా వారంతా నూతన్ నాయుడిని బయటకు తీసుకొచ్చారు. నటుడు కౌశల్ కు సంజనను జైలు నుండి బయటకు తీసుకువచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఆ పని చేయలేదు. అలా చేసినందుకు సంజన చేయి పట్టుకొని ఆమెను క్షమాపణ కోరాడు. ఇక స్విమ్మింగ్ పూల్ లో స్పూన్ తో వాటర్ తీస్తూ బకెట్ నింపాలనే టాస్క్ నటుడు తనీష్ పూర్తి చేశాడు.బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ రౌండ్ లో  సునయన, గణేష్, కిరీటీ, కౌశల్, నూతన్ నాయుడు, సంజన నామినేట్ అయ్యారు.