బిగ్ బాస్ సీజన్ 2 రోజురోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ షోని రసవత్తరంగా నడిపించడానికి నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు. ఈ షోలో సెలబ్రిటీ లతో పాటు ముగ్గురు కామన్ పీపుల్ కు కూడా అవకాశం ఇచ్చారు. కానీ మొదటి రెండు వారాల్లో ఇద్దరు కామన్ పీపుల్ సంజన, నూతన్ నాయుడు బయటకి వచ్చేశారు. ఓటింగ్ లో వీరికి అన్యాయం జరిగిందనే కామెంట్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. 

అయితే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కూడా కామన్ పీపుల్ కు అన్యాయం జరిగిందని అంటున్నారు. నిజానికి ఈ షోలో పాల్గొన్న ఒక్కో సెలబ్రిటీకు వారి రోజువారీ కాల్షీట్ కు ఎంత పారితోషికం తీసుకుంటారో దానికి డబుల్ చేసి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. మరి కామన్ పీపుల్ కు ఎంత పారితోషికం దక్కిందనే విషయంలో స్పష్టత వస్తోంది. సంజన, నూతన్ నాయుడులకు ఇప్పటివరకు ఈ షోలో పాల్గొన్నందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ గా ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ హౌస్ లో మెంబర్స్ గా కొనసాగడానికి దాదాపు 29 పేజీల అగ్రిమెంట్ పై సంతకాలు తీసుకున్నారని  తమ బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ కూడా తీసుకున్నారని సంజన, నూతన్ నాయుడులు వెల్లడించారు. కానీ తమకు ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని అన్నారు. నూతన్ నాయుడు తనకు డబ్బులు అక్కర్లేదని ముందే చెప్పినట్లు వెల్లడించారు. సంజన కూడా హౌస్ లో కనిపిస్తే చాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది.

దీంతో షో నిర్వాహకులు కూడా వారి రెమ్యునరేషన్ విషయాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా బిగ్ బస్ హౌస్ లో కామన్ మ్యాన్ కు రెమ్యునరేషన్ విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.