బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ కష్టాలు!

big boss2 first episode highlights
Highlights

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ఘనంగా మొదలైంది. నేచురల్ స్టార్ నాని 

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ఘనంగా మొదలైంది. నేచురల్ స్టార్ నాని తనదైన యాంకరింగ్ స్కిల్స్ తో షోని ఆద్యంతం రసవత్తరంగా నడిపించాడు. షోలో మొత్తం 16 మంది కంటెస్టంట్లను ఒక్కొక్కరిగా హౌస్ లో ఆహ్వానిస్తూ ఆసక్తిని క్రియేట్ చేశాడు. 13 మంది సెలబ్రిటీలు కాగా మరో ముగ్గురు సామాన్యులు కావడం విశేషం. అయితే ఈ ముగ్గురిలో ఒకరు మిస్ హైదరాబాద్ సంజనా, మరొకరు విజయవాడకు చెందిన గణేష్, అలానే వైజాగ్ కు చెందిన నూతన్ నాయుడు ఉన్నారు.

బిగ్ బాస్ మొదటిరోజు షోలో అర్హత లేని ఇద్దరిని ఎన్నుకోమని హౌస్ లో ఉన్నవారిని కోరారు. దానికి సెలబ్రిటీలందరూ కలిసి సామన్యులైన సంజనా, నూతన్ నాయుడులను ఎన్నుకున్నారు. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరినీ హౌస్ బయట ఉన్న జైల్లో పెట్టి తాళం వేయాలి. సోమవారం ఎపిసోడ్ లో ఒకరిని విడుదల చేసే అవకాశాలు ఉంది.

అయితే ఇలా సామన్యులిద్దరినీ సెలబ్రిటీలు కావాలని అర్హత లేనివారిగా ఎన్నుకోవడం పట్ల సంజనా ఫైర్ అయింది. కావాలనే సెలబ్రిటీలు ఈ విధంగా చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు టీవీల్లో ప్రసారం కానుంది. 

loader