స్టార్ మా బిగ్ బాస్ హౌజ్ లో కేరక్టర్ ఆర్టిస్ట్ అర్చన వేద తోటి హౌజ్ మేట్స్ అంతా ఇంటి నుంచి పంపేయాలని డిమాండ్ ఎలిమినేషన్ ఓటింగ్ లో అర్చనను పంపేయాలని ఏకగ్రీవంగా ఓట్లు
ఎన్టీఆర్ స్టార్ మా ఛానెల్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. షోలో ఎప్పటికప్పుడు సర్ ప్రైజెస్ ఇస్తున్నాడు ఎన్టీఆర్. ఈ వారం హీరో నవదీప్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆససక్తికరంగా మారింది. ఓటింగ్ లో పాల్గొన్నవాళ్లంతా ఇంట్లో అర్చన(వేద) ఉండొద్దని తేల్చి చెప్పారు.
వచ్చే వారం ఎలిమినేషన్ కు సంబంధించి సోమవారం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో 9మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 8 మంది అర్చనకు వ్యతిరేకంగా ఓటేశారు. అర్చన ప్రవర్తన సరిగా లేదని.. పదే పదే వాదిస్తూనే వుంటుందని, ఏదైనా వుంటే.. పదేపదే సాగదీస్తూ సభ్యులను ఇరిటేట్ చేస్తోందని సభ్యులందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు.
9 మంది ఓటేస్తే 8 మంది తనకు వ్యతిరేకంగా ఓటేయడంపై అర్చన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తానేం తప్పు చేశానంటూ అంతర్మథనంలో పడింది. తాను ఎంతో ఇష్టపడే వాళ్లు కూడా తనకు వ్యతిరేకంగా ఓటేయడంపై అర్చన ఆవేదన వ్యక్తం చేసింది. అర్చన తర్వాత అత్యధికంగా 5 ఓట్లు ధన్ రాజ్ కు పడ్డాయి. దీంతో అర్చన, ధన్ రాజ్, ముమైత్, హరితేజ వచ్చేవారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ముమైత్, హరితేజ గతవారం స్వచ్చంధంగా ఎలిమినేషన్ కు నామినేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే వీరిలో అర్చనను బయటికి పంపే ఛాన్సెస్ ఎక్కువ వున్నాయి. తన అసలు కేరక్టర్ ఏంటో నిర్మొహమాటంగా బిగ్ బాస్ హౌజ్ లోనూ బయటపెట్టడంతో తోటి సభ్యుల ఛీత్కారాలు ఎదుర్కొంటున్న అర్చనను బిగ్ బాస్ హౌజ్ నుంచి పంపేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇదే సరైన నిర్ణయమని సర్వత్రా అభిప్రాయాలు వెలువడటం విశేషం.
