బిగ్ బాస్ హౌజ్ లో 47వ రోజు గెస్ట్ గా సచిన్ జోషి సచిన్ జోషితో కలిపి కంటెస్టంట్స్ కు రోజీ లిప్స్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఈ టాస్క్ లో తమ ఫస్ట్ ఎక్స్ పీరియెన్స్ ఎలా చెడిపోయిందో చెప్పాలి అంతా తమతమ అనుభవం చెప్పినా.. టాపర్ అర్చన.. కారులోనే కానిచ్చేసిందట ముమైత్ అమెరికాలో ఓ స్ట్రిపర్ తో కానిచ్చిందట
బిగ్ బాస్ తెలుగు హౌజ్ వ్యవహారాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఏడవ వారం వీకెండ్ రోజుకు ముందు ఇంటి సభ్యులకు సాయంత్రం తర్వాత రోజీ లిప్స్ టాస్క్ ఇచ్చారు. హీరో సచిన్ జోషి ఈ షోలో గెస్ట్ గా వచ్చారు. ఈ గేమ్ ఆడిన సభ్యులు తమ బోయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో... జరిగిన ఫస్ట్ (ఎంబరాసింగ్ మూమెంట్) ఎక్స్ పీరియెన్స్ గురించి చెప్పాలి. ఇందులో భాగంగా మ్యూజిక్ ప్లే చేస్తారు. అది ఆపినప్పుడు రోజ్ ఎవరి లిప్స్ దగ్గర ఆగితే వాళ్లు తమ ఫస్ట్ ఎక్స్ పీరియెన్స్ గురించి చెప్పాలి. అలా ఆటమొదలు కాగానే తొలుత రోజ్ అర్చన దగ్గర వుండగా మ్యూజిక్ ఆగిపోయింది. దీంతో అర్చన తన తొలి అనుభవం గురించి చెప్పేసింది.
అర్చన రోడ్డుపై కారులోనే ముద్దులతో మొదలు పెట్టి ఇంటికెళ్లి ముగించేసిందట...
నేను ఒకతనితో లవ్ లో వున్నా. అతను బాంబే నించి. అదో స్వీట్ మూమెంట్. బాంబేలో నన్ను గుర్తుపట్టరు కదా. అక్కడైతే చల్తా. అతనితో నాకు చాలా కంఫర్టబుల్ గా వుంటుంది. ఆ కంఫర్ట్ తో పబ్లిగ్గానే కలుస్తాం. అదే కంఫర్ట్ తో.. నన్ను హైదరాబాద్ లో జనం గుర్తు పడతారు అని మరిచిపోయా. తను మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చాడు. మేం బయటికి వెళ్లాం... కారులోనే స్టాట్ చేశాం. అని చెప్తుండగా... ఏంటీ మీరు చేసిన కార్యక్రమం అంటూ సచిన్ యాంగ్జయిటీ ఎక్స్ ప్రెస్ చేశాడు. దానికి రిప్లైగా.. అర్చన కారులో కిస్సింగ్ చేస్తున్నాం. అయితే చుట్టుపక్కల జనం చూస్తున్నారని గుర్తించి.. తర్వాత ఇంటికెళ్లాం..అలా కానిచ్చేశాం. అంటూ చెప్పుకొచ్చింది.
శివ బాలాజీ వంతు, భయపడి పారిపోయాడట...
19 ఏళ్ల వయసులో పబ్స్ చెన్నైలో.. క్లోజ్ గా వుండింది. అమ్మాయి వచ్చి టక్ న స్మూచ్ చేసింది. ఎలా డీల్ చేయాలో తెలీక ఏయ్ ఏయ్ అని అరిచా. అక్కడి నుంచి పారిపోయా. అంతటితో అయిపోయింది.
టెర్రస్ పై నుంచి దూకి తప్పించుకున్న ప్రిన్స్ ...
17 ఏళ్లప్పుడు... గర్ల్ ఫ్రెండ్ వాళ్ల ఇంటికెళ్లి వాళ్ల మేడపై వున్నాం. వాళ్లమ్మ వచ్చింది. దాంతో నేను టీ షర్ట్ వేసుకుని టెరస్ పైనున్న ట్యాంక్ కింద దాక్కున్నా. టెరస్ డోర్ లాక్ చేయటంతో రోజంతా వుండి.. కొంచెం కష్టపడాల్సి వచ్చినా.. వేరే టెర్స్ ఎక్కి తతప్పించుకున్నా. ఎంబారసింగ్...
వర్షంలో కారులోనే.. ఆదర్శ్ కు పోలీసుల టార్చర్..,
గర్ల్ ప్రెండ్ తో కారులో వర్షం పడుతున్న సమయంలో బయటికెళ్లా. వాతావరణం రొమాంటిక్ గా అనిపించింది..కారులోనే కార్యక్రమం జరుగుతోంది. అలా మేకింగ్..హగింగ్.. జరుగుతోంది. అప్పుడొచ్చారు. బైక్ లో పోలీసులు.. కారులోంచి బయటికి రమ్మన్నారు. ఏం పని చేస్తున్నావన్నారు. టార్చర్ పెట్టారు. మళ్లీ ఇలా చేస్తే జైల్లో వేస్తాం అన్నారు.
అతను దగ్గరికి వచ్చాడు. చుట్టూ జనాన్ని చూసి పారిపోయానన్న దీక్ష..
కాలేజ్ చదివే రోజుల్లో అబ్బాయి వెంటపడ్డాడు. తప్పించుకున్నా. చాలా సార్లు ఐ కాంటాక్ట్ లేకుండా. నాకు తెలుసు అతను నన్ను ఇష్టపడ్డాడు. తను ఇలా దగ్గరికి వచ్చాడు. క్లోజ్ గా హగ్ ఇచ్చేశాడు. జనం చూశారు. నేను జంప్. ఇదేం ఫస్ట్ టైమ్.. బాగాలేదు అంటూ సచిన్ కమెంట్ చేశాడు.
ఈ బెడ్ మీ పేరెంట్స్ దా అనడిగానంటున్న నవదీప్...
అప్పుడు గర్ల్ ఫ్రెండ్ వుండేది. రెండు మూడు నెలలు అలా అలా గడిచింది. తర్వాత ఒకరోజు వాళ్ల పేరెంట్స్ ఇంట్లో లేరని చెప్పింది. వెళ్లాను. పొద్దున్నే లేచాక రూం బాగుందన్నా. ఇది మా పేరెంట్స్ బెడ్ అంది. అయ్య బాబోయ్ అనుకున్నా. ఇక ఆ తర్వాత కొంత కాలానికి మరో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లినప్పుడు... ఇది మీ పేరెంట్స్ బెడ్ రూమా అనడిగితే గెటౌట్ అంది. దాంతో అర్చన అబద్ధం చెప్తున్నావు. నేనెలా నిజం చెప్పాను.. అనగానే నువు జస్ట్ కిస్సింగ్ అని తప్పించుకున్నావుగా.. అంటూ నవదీప్ కౌంటర్ ఇచ్చాడు. నేను నిజాయితీగా చెప్పానని అర్చన కాసేపు వాదులాడింది.
పీక్ టైమ్ లో అమ్మాయి వాళ్ల నాన్న వచ్చాడన్న సచిన్ జోషి...
సచిన్ వంతు రాగానే... నేను, నా గర్ల్ ఫ్రెండ్.. వాళ్లఇంట్లో.. అలా అలా అంతా రెడీ అయింది. ఇద్దరం మాంచి పీక్స్ కి వెళ్లాం. సడెన్ గా వాళ్ల నాన్న వచ్చారు. వెంటనే పరుగో పరుగు అంటూ సచిన్ తన అనుభవం చెప్పుకొచ్చాడు.
ముమైత్ ఖాన్ స్ట్రిపర్ తో కానిచ్చేసిందట..
ముమైత్ ఖాన్ తన 30వ పుట్టినరోజు సందర్భంగా... అమెరికాలో వుందట. అప్పుడు ఒక స్ట్రిపర్(ఎరోటిక్ అంటే..ఎదురుగా నగ్నంగా ప్రదర్శన ఇచ్చేవాళ్లు)ను హైర్ చేసుకుందట. అదే తన 30వ ఏట అడుగుపెట్టినప్పటి బర్త్ డే గిఫ్ట్ అట.
గోవాలో ఫస్ట్ టైమ్ ముద్దుముచ్చట..అప్పుడు హరితేజ రూంలోనే ఫ్రెండ్..
పదిహేనేళ్లకే తందానా అంటూ నవదీప్ కమెంట్ చేస్తుండగా.. చివరగా తన అనుభవం చెప్పిన హరితేజ.. గోవాలో వున్నాం అప్పుడు. నా డ్రీమ్ ఏంటంటే.. నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావా అనడిగా. రోడ్డుపైన అలా దింపకుండా చాలా దూరమే తీసుకెళ్లాడు. అక్కడ మేమిద్దరమే వున్నాం. చుట్టూ ఎవ్వరూ లేరు. వాతావరణం అంతా ఫుల్ రొమాంటిక్ గా వుంది. అలా అతను ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడే ఏదో ట్రాన్స్ లోకి వెళ్లిపోయా. అలా అలా రూమ్ లోకి వెళ్లాం. రూంలో కడ్లింగ్.., కిస్సింగ్,, అలా అలా ఏదో చేస్తున్నాం. కానీ మా ఫ్రెండ్ అక్కడే వుంది. అది గమనించకుండా మేం ఆవేశ పడ్డాం. అది చాలా ఎంబరాసింగ్.. కాసేపటికి హావ్ ఫన్ అని చెప్పి మా ఫ్రెండ్ బయటికెళ్లిపోయింది. అయితే.. నెక్స్ట్ డే మార్నింగ్ తలెత్తుకోలేకపోయా అంటూ చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ రియాలిటీ షోలో వీళ్లంతా నిజం చెప్పారో లేక అబద్ధం చెప్పారో తెలీదు కానీ.. ఇలాంటి విషయాల గురించి ఓపెన్ అవడం సర్వత్రా ఆసక్తి క్రియేట్ చేసింది. అయితే.. ఇవేం టాస్క్ లు అంటూ తీవ్రంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
