బిగ్ బి కి నచ్చిన రకుల్ మూవీ ట్రైలర్

big b amithab bachan likes rakul preeth aiyaari trailer
Highlights

  • బిగ్ బి కి నచ్చిన రకుల్ మూవీ ట్రైలర్
  • తాజాగా రకుల్ కథానాయికగా నటించిన హిందీ చిత్రం ‘అయ్యారీ’
  • అయ్యారీ బాగా నచ్చిందని ట్వీట్ చేసిన బిగ్ బి

తెలుగులో అగ్రకథానాయికల్లో ఒకరుగా వెలుగొందుతోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్. తాజాగా రకుల్ కథానాయికగా నటించిన హిందీ చిత్రం ‘అయ్యారీ’. నీరజ్‌ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రకుల్‌కి జోడీగా సిద్దార్థ్‌ మల్హోత్రా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.

 

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కి కూడా ఈ చిత్ర ట్రైలర్‌ తెగ నచ్చేసిందట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘అయ్యారీ’ ట్రైలర్‌ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో ప్రతిభ గల నటీనటులతో పాటు మంచి కాన్సెప్ట్‌ కూడా ఉంది. దర్శకుడు నీరజ్‌ పాండేకి బెస్ట్‌ విషెస్‌’ అంటూ అమితాబ్‌ ట్వీట్‌ చేశారు.

 

దీనికి రకుల్‌ రిప్లై.. ‘ధన్యవాదాలు సర్‌. మీకు ట్రైలర్‌ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ఇద్దరు భారత ఆర్మీ అధికారుల మధ్య జరిగిన సంఘటనలను ‘అయ్యారీ’ చిత్రంలోచూపించబోతున్నారు. ఇందులో మనోజ్‌ బాజ్‌పాయ్‌, నసీరుద్దిన్‌ షా, అనుపమ్‌ ఖేర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2018 జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

loader