మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అయితే ‘సైరా’ గురించి అమితాబ్ బచ్చన్ చేసే ఒక్కో ట్వీట్ చిరంజీవి అండ్ కోకి చెమటలు తెప్పిస్తున్నాయి.

 

తాజాగా సైరాలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన పిక్స్ లీక్ చేసి అందరినీ అవాక్కయ్యారా… అనేలా చేశారు బిగ్ బి. అమితాబ్ చేసే ట్వీటులకు ఆ టైపులో అవాక్కవ్వడం ‘సైరా’ టీమ్ వంతవుతోంది. ఆయన షూటింగులో జాయిన్ అయ్యి రెండు రోజులు అవుతోంది. ఇప్పటివరకూ మూడు ఫొటోలు నెట్టింట్లో పెట్టారు. ఒకటి… ప్రీ-లుక్ అంటూ ఆయన లుక్ ఎలా ఉండబోతుందో హైదరాబాద్‌కి బయలుదేరే కొన్ని గంటల ముందు బ్లాగులో పోస్ట్ చేశారు. రెండు… షూటింగులో జాయిన్ అయిన తరవాత ఆయన లుక్ ట్వీట్ చేశారు. మూడు… చిరంజీవి, నయనతార లుక్స్ రివీల్ అయ్యేలా షూటింగ్ స్టిల్ బయటకు వదిలారు. ‘సైరా’లో అమితాబ్‌తో క్యారెక్టర్ చేయిస్తే… దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని చిరంజీవి అండ్ కో భావించారు.

 

అమితాబ్ వల్ల దేశ వ్యాప్త గుర్తింపు ఏమో కానీ... ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా మిసైల్ వదిలి చిరు లుక్ రివీల్ చేసి ‘సైరా’ టీమ్‌తో పాటు ప్రేక్షకులు, అభిమానులకు షాకిచ్చేశారు. బాహుబలి తర్వాత అదే స్థాయిలో సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. బడ్జెట్ తిరిగి రాబట్టాలన్నా.. ‘బాహుబలి’ స్థాయిలో ప్రచారం రావాలన్నా.. ప్రతిదీ ఓ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. కాని అమితాబ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా షాకిచ్చారు. మరి ఇలాంటి షాకులిస్తున్న మెగాస్టార్ ముమ్ముందు ఇంకేం లీకులిస్తారో, ఇంకెన్ని షాకులిస్తారో...