యాక్సిడెంట్ లో నటి మనీషా మృతి!

bhojpuri actress maneesha rai killed in road accident
Highlights

భోజ్ పురి నటి మనీషా రాయ్(45) రోడ్డు ప్రమాదంలో చనిపోవడం

భోజ్ పురి నటి మనీషా రాయ్(45) రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. 'ఖోబర్' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటిగా పాపులర్ అయింది. ఆ తరువాత పలు సీరియళ్లతో పాటు సినిమాలలో కూడా నటించారు.

షూటింగ్ కోసం తన కోస్టార్ సంజీవ్ మిశ్రాతో కలిసి బైక్ మీద వెళ్తుండగా.. బల్లియాలోని చిట్టౌని గ్రామంలో యాక్సిడెంట్ జరిగింది. బైక్ వెనుక నుండి ఓ కారు వచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

తీవ్ర రక్తస్రావంతో మనీషా అక్కడికక్కడే మృతి చెందగా, సంజీవ్ మిశ్రా కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకొని శిక్షిస్తామని వెల్లడించారు. 

loader