Bheemla Nayak చిత్రానికి సంబంధించిన ఓ కొత్త ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌, రానా ల దర్జా ఆకట్టుకుంటుంది. ఇద్దరు హీరోల అభిమానులకు ఫుల్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉంది.

`భీమ్లా నాయక్‌` నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఊహించని గిప్ట్ తో అటు పవన్‌, ఇటు రానాల అభిమానులు పండగా చేసుకుంటున్నారు. Pawan Kalyan, Rana కలిసి Bheemla Nayak చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌, రానా ల దర్జా ఆకట్టుకుంటుంది. ఇద్దరు హీరోల అభిమానులకు ఫుల్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉంది. 

ఇందులో పవన్‌ కళ్యాణ్‌, రానాలున్నారు. షూటింగ్‌ సెట్‌లో పవన్‌ కళ్యాణ్‌ మంచంపై పడుకోగా, ఎండ్ల బండిపై రానా ఉన్నారు. పవన్ చాతిపై గాయం కనిపిస్తుంది. షూటింగ్‌లో అలసిపోయి ఇలా సేదతీరుతున్నట్టుగా ఉన్నారు వీరిద్దరు. ఈ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేస్తుంది. అన్‌వైండింగ్‌ ఆఫ్‌ ది కెమెరా అంటూ నిర్మాణ సంస్థ పంచుకున్న ఈ ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. క్లైమాక్స్ షూటింగ్‌లో భాగంగా ఈ పిక్ తీసినట్టు తెలుస్తుంది. 

also read:అభిమానులకు మళ్లీ షాకివ్వబోతున్న పవన్‌.. సినిమాలకు ఫుల్‌ టైమ్‌ బ్రేక్‌? నిర్మాతల్లో టెన్షన్‌..

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` కి రీమేక్‌గా `భీమ్లా నాయక్‌` రూపొందుతుంది. ఇందులో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌గా, రానా డేనియల్‌ శేఖర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య జరిగే ఫైటింగ్‌ నేపథ్యంలో ఈ సాగనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ గ్లింప్స్, టీజర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానాసరసన సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన `భీమ్లా నాయక్‌`, `అంత ఇష్టమేందయ్యా.. `అంటూ సాగే పాటలకు మంచి స్పందన లభించింది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. 

also read: ప్రభాస్ ని బాగా స్టడీ చేసిందిగా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన కృతి సనన్