అభిమానులకు మళ్లీ షాకివ్వబోతున్న పవన్.. సినిమాలకు ఫుల్ టైమ్ బ్రేక్? నిర్మాతల్లో టెన్షన్..
`వకీల్‌సాబ్` వంటి బిగ్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్‌తో వచ్చారు. ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్న సమయంలో మళ్లీ షాకివ్వబోతున్నాడు పవన్. పూర్తి స్థాయిలో సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడనే వార్త ఇప్పుడు అభిమానులు, నిర్మాతల్లో గుబులు పుట్టిస్తుంది.
Pawan Kalyanరెండేళ్లు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని గత ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ తర్వాత రీఎంట్రీతో బ్యాక్ టూ బ్యాక్ ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. Vakeel Saab వంటి బిగ్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్‌తో వచ్చారు. ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్న సమయంలో మళ్లీ షాకివ్వబోతున్నాడు పవన్. పూర్తి స్థాయిలో సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడనే వార్త ఇప్పుడు అభిమానులు, నిర్మాతల్లో గుబులు పుట్టిస్తుంది.
పవన్‌కళ్యాణ్ `అజ్ఞాతవాసి` సినిమా తర్వాత బ్రేక్ తీసుకుని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. రాజకీయాల్లో రాణించాలంటే, పార్టీ నడిపించాలంటే డబ్బు కావాలని, అందుకోసం సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించారు పవన్. రీఎంట్రీ ఇస్తూ `వకీల్‌సాబ్` చిత్రంలో నటించారు. ఈ సినిమా విడుదలై భారీ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. కరోనా సమయంలోనూ వంద కోట్లు వసూలు చేసి పవన్ స్టామినాని చాటి చెప్పింది.
ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో Harihara Veeramallu చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నుంచి తిరిగి ప్రారంభం కానుందట. అంతకంటే ముందే ఈ నెల 25నుంచి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్‌రాంపాల్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు క్రిష్ బృందం ప్లాన్ చేస్తుందట. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది.
మరోవైపు `భీమ్లా నాయక్` షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్నారు. ఇందులో నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. రానా మరో హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని Bheemla Nayak, రానా పాత్రల ఫస్ట్ లుక్‌లు, ఫస్ట్ గ్లింప్స్ లు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Bhavadeeyudu Bhagat Singh
వీటితోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్‌సింగ్` చిత్రంలో పవన్ నటించనున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. దీంతోపాటు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే మరో ఇద్దరు నిర్మాతలకు సినిమాలు చేసేందుకు కమిట్‌మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. బ్యాక్ టూ బ్యాక్ ఆయా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. ఇలా దాదాపు మూడు వందల కోట్లు ఆయన పారితోషికంగా తీసుకోబోతున్నాడని టాలీవుడ్‌లో భోగట్టా.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మళ్లీ Politicsపై ఫోకస్ పెడుతున్నాడట. వచ్చే 2024 Elections పూర్తి స్థాయిలో పోటీకి దిగాలని భావిస్తున్నారు. అందుకు ఏడాది ముందు నుంచి ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారట. ఇటీవల పవన్ ప్రసంగాలకు యువత నుంచి మంచిస్పందన లభిస్తుంది. పైగా కులాల అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు పవన్. వైఎస్‌జగన్‌కి ఉన్న వ్యతిరేకత క్యాష్ చేసుకునేందుకు, ఆయన్ని వ్యతిరేకించే కులాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు పవన్. ఆయన ప్రసంగాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే సీఎంగా గెలవాలనే లక్ష్యంతో ఆయన వచ్చే ఎన్నికల బరిలో దిగబోతున్నాడని సమాచారం.
Pawan Kalyan
అందులో భాగంగానే పవన్ ఇక పూర్తి స్థాయిలో సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లో బిజీ కావాలని భావిస్తున్నాట. అయితే 2023 వరకు ఎన్ని సినిమాలు అయితే అన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల్లో ప్రధానమైన సినిమాల వరకు కంప్లీట్ చేసే ప్లాన్‌లో ఉన్నారట. ఆ తర్వాత సినిమాలకు బ్రేకివ్వాలనుకుంటున్నారట. దీంతో ఇప్పుడు అటు అభిమానుల్లో, ఇటు నిర్మాతల్లో కలవరం స్టార్ట్ అయ్యింది. పవన్‌తో సినిమాలు చేసేందుకు ఎదురుచూస్తోన్న చాలా మంది నిర్మాతలక, దర్శకులకు నిరాశే తప్పదని, కమిట్ అయిన నిర్మాతల పరిస్థితి కూడా సస్పెన్స్ లో ఉందని టాక్. దీంతో ప్రొడ్యూసర్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యిందంటున్నారు.
మరోవైపు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో కెరీర్‌ని పరుగులు పెట్టిస్తున్న పవన్ ని చూసి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక ఏడాదికి రెండు సినిమాలతో ఎంజాయ్ చేయొచ్చని, టాలీవుడ్‌లో ఇతర స్టార్ హీరోల అభిమానుల మాదిరిగా కాలర్ ఎగరేసి మరి ధైర్యంగా తిరగొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ నుంచి వస్తోన్న ఈ వార్తలు విని వారు కూడా షాక్ అవుతున్నారు. మళ్లీ నిరాశ చెందాల్సిందేనా అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి పవన్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, రాజకీయాలను, సినిమాలను ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.