ప్రభాస్ ని బాగా స్టడీ చేసిందిగా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన కృతి సనన్
ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్న చిత్రం Adipurush. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ నటుడు Saif Ali Khan రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

యంగ్ రెబల్ స్టార్ Prabhas జోరు బాలీవుడ్ స్టార్స్ కి సైతం దిమ్మతిరిగేలా ఉంది. ఏ ఇండియన్ హీరోకి సాధ్యం కాని విధంగా ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులపై చేసిన మ్యాజిక్ అలాంటిది.
ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్న చిత్రం Adipurush. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ నటుడు Saif Ali Khan రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Kriti Sanon కెరీర్ లో ఇది మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ప్రభాస్ పక్కన నటిస్తుండడంతో కృతి సనన్ సంతోషానికి అవధులు లేకుండా ఉంది. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సీక్రెట్స్ రివీల్ చేసింది. రియల్ లైఫ్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో తెలిపింది. సాధారణంగా ప్రభాస్ ఒంటరిగా ఉండేదుకు ఇష్టపడతాడు. అవసరమైతే తప్ప మాట్లాడడు. కొత్త వారితో మాట్లాడేందుకు బాగా ఇబ్బంది పడతాడు.
కృతి సనన్ మాట్లాడుతూ.. ప్రభాస్ కి కొంచెం సిగ్గు ఎక్కువ. కొత్తవాళ్లతో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కానీ ఒకరి సమయం కేటాయించి వారితో మాట్లాడితే.. ప్రభాస్ కూడా బాగా మాట్లాడతాడు. జోకులు కూడా వేస్తాడు. ప్రభాస్ వద్ద ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని కృతి సనన్ పేర్కొంది.
సెట్స్ లో అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి ప్రభాస్ జోకులతో చెలరేగుతుంటాడు అని కృతి సనన్ తెలిపింది. ఇక ప్రభాస్ వీలుచిక్కినప్పుడల్లా తన కో స్టార్స్ కి డిన్నర్ పార్టీ ఇస్తుంటాడు. హైదరాబాద్ బిర్యానీ, ఆంధ్ర రుచులని వారికి పరిచయం చేస్తుంటాడు.